Kurnool POCSO Court: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష , 50 వేల రూపాయల జరిమానా విధించింది పోక్సో కోర్టు.. 2020లో బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై రుద్రేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు రుద్రేష్.. బాలిక కేకలు వేయడంతో తల్లితోపాటు స్థానికులు వెళ్లగా అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు.. అయితే, కోర్టులో నేరం రుజువు కావడంతో ముద్దాయి అయిన రుద్రేష్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించారు పోక్సో కోర్టు న్యాయమూర్తి..
Read Also: Relationship: ‘‘ ఫేస్‌బుక్ పరిచయం, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి’’.. వివాహిత దారుణ హత్య..