Union Minister Gajendra Singh Shekhawat: మోడీ విజన్, చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Gajendra Singh Shekhawat: ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్లానింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.. ఇక, ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన రోజును సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకున్నాం.. వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం కోల్పోయిన రోజుగా భావించామన్న ఆయన.. ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమంగా ఎమర్జెన్సీని గుర్తించారు.. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని ఇచ్చారని గుర్తుచేశారు..
Read Also: NTR: త్రివిక్రమ్ సినిమా హోంవర్క్ మొదలెట్టిన ఎన్టీఆర్.. ఇదిగో ప్రూఫ్?
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఇక, 450 కోట్లు టూరిజం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చింది.. చాలా ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయి.. వాటిలో ఒకటి రాజమండ్రిలో ఇవాళ ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి పలు ప్రాజెక్టులపై కూడా చర్చించామని వెల్లడించారు గజేంద్ర సింగ్ షెకావత్.. మోడీ విజన్, చంద్రబాబు ప్లానింగ్ తో ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఆన.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.. ప్రణాళిక బద్ధంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తాం అన్నారు.. మరోవైపు, పెహల్గామ్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.. పర్యాటకులు స్వేఛ్చగా అక్కడ ప్రాంతాలను సందర్శించ వచ్చు అన్నారు.. మరో పదిహేను రోజుల్లో అక్కడ పర్యాటకుల సందడి మొదలవుతుందని వెల్లడించారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
Read Also: Hyderabad: శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్త కోణం..
కాగా, ఏపీలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటిస్తున్నారు.. ఆయన పర్యటనలో భాగంగా రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చారు.. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు… ఎమర్జెన్సీ కి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్ గురించి మాట్లాడారు… ఏపీకి వచ్చే పలు ప్రాజెక్టులు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా వస్తున్నాయని అన్నారు.. పెహల్గావ్‌లో పరిస్ధితులు చక్కబడ్డాయని, మరో 15 రోజుల్లో పూర్తిస్ధాయి పర్యాటకం చూడచ్చని కేంద్రమంత్రి తెలిపారు…
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!