రౌడీలతో పోరాటం చేస్తున్నా.. వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం..!
నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.. ఏడాది కాలంలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణతో నాంది పలికాం.. ఎంత పెద్ద మొత్తంలో ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.. డబ్బులు ఇవ్వడమే కాదు ఒకటోవ తేదీనే పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం.. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తున్నాం.. తల్లి వందనం క్రింద 10 వేల కోట్ల రూపాయలు వేశాం.. ధాన్యం కొనుగోలులో కొన్ని ఇబ్బందులు వచ్చిన తరువాత కూడా రైతుల ఖాతాలో డబ్బులు.. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం అని వెల్లడించారు.
పుట్టకతోనే లివర్ సమస్య.. 6 నెలల చిన్నారి ప్రాణాలు నిలిపిన మంత్రి లోకేష్..
సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన తగిన సాయం అందించడంలో ముందు ఉంటారు మంత్రి నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విదేశాల్లో చితికిపోతున్న ఎంతో మందిని స్వదేశానికి రప్పించిన ఘనత ఆయన.. తాజాగా, పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు మంత్రి లోకేష్… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో.. ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది. దీంతో వైద్యఖర్చులకు గాను రూ.10 లక్షల వరకు ఎల్ వోసీ మంజూరుచేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అధికమొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. దీంతో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచే ఏర్పాటు చేసారు లోకేష్.
పాశమైలారం ప్రమాదం: గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ రోజు ( జూలై 1న) పటాన్‌చెరువు సర్కారు దవాఖానలోని మార్చురీలో ఉన్న మృతదేహాలు చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏ మృతదేహం ఎవరిదో తెలియక మార్చురీ దగ్గర కార్మికుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. డీఎన్ఎ రిపోర్ట్ వచ్చిన తర్వాత వైద్య శాఖ అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు పటాన్ చెరువు మార్చురీలో గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు డాక్టర్లు.
పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని పాశమైలారంలో జరిగిన పేలుడులో సుమారు 40 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తనిఖీ విభాగాలు సరిగ్గా పని చేయక పోవడం వల్ల ప్రమాదం జరిగింది అని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో పాటు నిర్లక్య ధోరణి వల్ల ప్రమాదం చోటు చేసుకుంది.. ఇది ఫ్యాక్టరీ యాజమాన్యం జరిపిన హత్య.. రాష్ట్రంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలపై తనిఖీ విభాగాలను ఏర్పాటు చేయాలని సీపీఐ నారాయణ కోరారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ. లక్ష కోట్లతో ఆర్‌డీఐ స్కీమ్‌కు గ్రీన్సిగ్నల్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన ప్రోత్సాహక పథకంకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు సరికొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉత్పాదక రంగానికి ప్రాధాన్యతనిస్తూ కొత్తగా తొలిసారి ఉద్యోగాల్లో చేరే వారికి ప్రోత్సాహకాలు.. మొదటి సారి ఉద్యోగంలోకి వచ్చే వారికి రెండు విడతలుగా రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి 6 నెలలు పూర్తయ్యాక మొదటి కిస్తీ, 12 నెలల పూర్తయిన తర్వాత రెండో కిస్తీ.. వస్తూత్పత్తి రంగంలో అదనపు ఉద్యోగాల కల్పన కోసం, యజమానులకు రెండేళ్ళ పాటు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఐఐటీ బాంబేలో చొరబాటుదారుడి కేసులో కీలక విషయాలు.. ఉగ్ర కోణంలో విచారణ..
ఐఐటీ బాంబేలో విద్యార్థిగా నటిస్తూ 14 రోజలు పాటు అక్రమంగా నివసించిన 22 ఏళ్ల వ్యక్తి బిలాల్ అహ్మద్‌ను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 26న బిలాల్ సోఫాపై నిద్రిస్తున్నట్లు గమనించిన ఐఐటీ బాంబే ఉద్యోగి, ఎవరు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా పారిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ద్వారా అధికారులు అతడిని గుర్తించారు. ప్రస్తుతం, అతడిని జూలై 07 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. బిలాల్ హాస్టల్ గదుల్లో సోఫాపై పడుకునేవాడు, అనేక సెమినార్లకు హాజరయ్యే వాడని తేలింది. తనను తాను పీహెచ్‌డీ విద్యార్థిగా పరిచయం చేసుకుని, నకిలీ అడ్మిషన్ పత్రాలను ఉపయోగించినట్లు తేలింది. క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై నిర్వహించిన సెమినార్‌కు కూడా హాజరైనట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది.
“ఆర్సీబీ” న్యూసెన్స్ చేసింది.. పోలీసులు దేవుళ్లు కాదు..
ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రాథమికంగా మూడు నుంచి 5 లక్షల మంది ప్రజలు సమావేశమయ్యేలా చేసినందుకు ఆర్సీబీ బాధ్యత వహించనట్లు కనిపిస్తోంది. ఆర్సీబీ పోలీసుల నుంచి తగిన అనుమతి, సమ్మతి తీసుకోలేదు. అకస్మాత్తుగా, వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. దీంతోనే ప్రజలు గుమగూడారు’’ అని ట్రిబ్యునల్ చెప్పింది. ఆర్సీబీ చివరి నిమిషంలో విజయోత్సవ కార్యక్రమం గురించి ప్రకటించడాన్ని ట్రిబ్యునల్ విమర్శించింది. ‘‘ఆర్సీబీ ముందస్తు అనుమతి లేకుండా న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దాదాపు 12 గంటల తక్కువ సమయంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తారని ఆశించలేము’’ అని చెప్పింది.
ప్రభాస్ కాలికి ‘ఫౌజీ’ షూట్లో గాయం.. అసలేమైందంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ప్రస్తుతానికి ఫౌజీ అని సంబోధిస్తున్నారు. హను రాఘవపుడి దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రభాస్ కాలికి ఫ్రాక్చర్ జరిగిందని అంటున్నారు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. నిజానికి ప్రభాస్ కాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ కూడా గతంలో చేయించుకున్నారు. పరీక్షల కోసం ఈ మధ్య ఇటలీకి వెళ్లి కొన్నాళ్లు విశ్రాంతి కూడా తీసుకున్నారు.
విశ్వంభర వెయిటింగ్… వర్త్ వర్మా వర్తు!
మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. అయితే గేమ్ చేంజర్ కారణంగా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో తమ సినిమా వాయిదా వేసినట్లు దసరా సమయంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయి దాదాపు ఆరేడు నెలలు పూర్తవుతుంది.