Off The Record: నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎందుకంత క్రేజ్..?
- నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటా పోటీ..
- జిల్లాలందు నల్గొండ వేరన్నట్టుగా పరిస్థితి..3 రాష్ట్ర స్థాయి పదవులు వద్దనుకుని మరీ.. డీసీసీ రేస్‌లోకి..
- మా వాళ్ళకే ఇప్పించుకోవాలని సీనియర్స్ ప్రయత్నాలు..
- ఎదగాలంటే డీసీసీ సరైన పోస్ట్ అన్న అభిప్రాయం..
- గట్టి ప్రయత్నాల్లో మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు మోహన్‌రెడ్డి..
- నేనున్నానంటున్న జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్య..
- రేస్‌లో దేవరకొండ, మునుగోడు నాయకులు..
- స్థానిక ఎన్నికల్లో బీ ఫామ్‌లు ఇచ్చే అధికారం జిల్లా అధ్యక్షుడిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యమా డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే… స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో… డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట ఏఐసీసీ. అదే జరిగితే… రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపుల కీలక పాత్ర ఉంటుందిగనుక… ఆ పోస్ట్‌కు యమా క్రేజ్ ఏర్పడిందట. అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి ఉంటుంది కదా…. ఇక్కడ మాత్రమే ఎందుకలా అంటే… మా జిల్లా కాస్త ప్రత్యేకం అంటున్నారట స్థానిక కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కార్పొరేషన్ పదవుల మీద సీరియస్‌గా ద్రుష్టి పెట్టిన నల్లగొండ నేతలు… తాజాగా రూట్ మార్చి….. డిసిసి పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారట. అంతేకాదండోయ్… ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం పలువురికి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కట్టబెట్టింది. ఇక్కడి నాయకులు కొందరికి ఆ ఆఫర్ ఇచ్చినా… వద్దనుకుని మరీ, డీసీసీ రేస్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Dowry Harassment: వరకట్న వేధింపులు.. పెళ్ళైన రెండు నెలలకే ఘోరం..!
Also Read
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు ఒక ఎత్తయితే… మా వాళ్ళకే ఇప్పించుకోవాలంటూ…. సీనియర్స్ చేస్తున్న ప్రయత్నాలు మేటర్‌ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. సీనియర్ నేత జానారెడ్డి అనుంగు శిష్యుడిగా ముద్ర ఉన్న శంకర్ నాయక్ రెండు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో… పోస్ట్ ఖాళీ అయింది. ఈ క్రమంలో డీసీసీ పీఠం దక్కాలంటే సీనియర్ నేతల ఆశీస్సులు ఉండాల్సిందేనని, అంతకు మించి రాజకీయాల్లో ఎదగాలంటే అందరివాడిని అనిపించుకొవాలని, అందుకు డీసీసీనే సరైన పోస్ట్ అని భావిస్తున్నారట ఎక్కువ మంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడిగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి.. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని తిరస్కరించారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి మాత్రమే కావాలని బహిరంగంగానే చెబుతున్నారాయన. ఆయనకు పలువురు నేతలు మద్దతు ప్రకటించడం కొసమెరుపు. అటు డీసీసీ అశిస్తున్న జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్యకు కూడా ఉపాద్యక్ష పదవి వద్దని.. డీసీసీ పీఠం వైపే మొగ్గుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు డీసీసీ ఇవ్వాలని పట్టుబడుతున్నారట ఆయన. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన జాల నరసింహారెడ్డి, మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీసీ నేత పున్నా కైలాష్ కూడా డీసీసీ రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ పదవిపై పెద్దగా ఆసక్తి చూపని నేతలు… ఇప్పుడు రూట్ మార్చి… ఓ రేంజ్‌లో పైరవీలు మొదలు పెట్టడం వెనక పెద్ద కథే ఉందని అంటున్నారు సొంత పార్టీ నేతలు..
Read Also: Triple Murders: హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఈ హత్యల్లో మిస్టరీ ఏంటి..?
రాబోయేది స్థానిక ఎన్నికల కాలం. పార్టీ బీ ఫామ్స్ అన్ని డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉండటం వల్లే ఈ క్రేజ్ అన్నది విస్తృతాభిప్రాయం. పీఠాన్ని దక్కించుకునేందుకు కొందరు తమ నేతను దాటి… మరో సీనియర్ నేత ఆశీస్సుల కోసం వెళ్తుండటంతో సీనియర్స్ మధ్య ఆధిపత్యపోరుకు తెరలేచే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వరుసగా రెండు సార్లు డీసీసీ పీఠం ఎస్టీలకే దక్కడంతో ఈసారి ఆ లెక్కమారాల్సిందేనని పట్టుబడుతున్నారట పలువురు నేతలు. ఈ విడత ఓసీలకే ఇవ్వాలని కొందరు… బీసీ, ఎస్సీలకు అసలు అవకాశమే ఇవ్వారా అని మరి కొందరు పార్టీ పెద్దలను నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్దితుల్లో డీసీసీ పీఠంపై కూర్చుంటే చాలా లాభాలుంటాయని భావిస్తున్నారట ఎక్కువ మంది. అందుకే…. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ….. వత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. దీంతో ఆ నేతల ఎత్తుగడలు జిల్లా సీనియర్ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయట. అంతేకాదు… తమ అనుచరుడికే డీసీసీ పీఠం ఇప్పించుకోవాలన్న పట్టుదల సీనియర్స్‌లో పెరిగేంతలా వాళ్ళని ప్రభావితం చేస్తున్నారట. దీంతో డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుంది… జిల్లా సీనియర్ నేతలు ఎవరివైపు మొగ్గు చూపుతారు… క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏవిధంగా ఉంటాయన్న ఆసక్తి పెరుగుతోంది. అలాగే మంత్రి కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిల్లో ఎవరి పంతం నెగ్గుతుంది.. ఎవరికి అనుచరుడికి ఆ అదృష్టం ఎవరిస్తుందంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..