Off The Record: చంద్రబాబు టేబుల్ మీద టీడీపీ ఎమ్మెల్యేల చిట్టా..? సీరియస్ వార్నింగ్..!
- చంద్రబాబు టేబుల్ మీద టీడీపీ ఎమ్మెల్యేల రిపోర్ట్స్?..
- టెక్నాలజీ సాయంతో డీప్‌గా వెళ్తున్న బాబు..
- కొందరి రిపోర్ట్ బాగా బ్యాడ్‌గా ఉందా?..
- సగానికిపైగా ఎమ్మెల్యేల తీరు వరస్ట్ అని వచ్చిందా?..
- పార్టీ కార్యకర్తల్ని కూడా దగ్గరికి తీసుకోవడం లేదా?..
- రోజూ కొందరితో మాట్లాడి వార్నింగ్ ఇస్తున్నారా?..
- మరీ ఇంత బ్యాడ్ ఉందా అంటూ టీడీపీ వర్గాల్లో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిపోయింది. కానీ… అంతకు చాలా రోజుల ముందు నుంచే… తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద దృష్టి పెట్టారట సీఎం చంద్రబాబు. శాసనసభ్యుల ప్రతి మూవ్‌మెంట్‌కు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగానే… సర్వేలు, నివేదికల మీద ఎక్కుక ఆధారపడే బాబు…. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలజీ సాయంతో… ఇంకా డీప్‌గా వెళ్తున్నారట. అలా… తమ పార్టీ శాసనసభ్యులకు సంబంధించి పిన్ టు పిన్ రిపోర్ట్ తెప్పించుకున్న క్రమంలో… కొందరి రికార్డ్ బాగా…. బ్యాడ్‌గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే… పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అంటే…కేవలం ప్రజాప్రతినిధేగాక… ఆ నియోజకవర్గంలో పార్టీకి ఆయువుపట్టు లాంటివాడు కూడా. అటు జనంతోనూ, ఇటు పార్టీ కార్యకర్తలతోను సత్సంబంధాలు ఉన్నప్పుడే… అంతిమంగా అది ప్రభుత్వం మీద సానుకూలతను పెంచుతుంది. కానీ….చంద్రబాబు దగ్గరున్న రిపోర్టులో సగానికి పైగా ఎమ్మెల్యేల తీరు వరస్ట్‌గా ఉన్నట్టు తేలిందట.
Read Also: Banakacherla Project: ఏపీకి షాకిచ్చిన కేంద్రం..! బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి ..
Also Read
జనంతో సంబంధాలు లేకపోగా… మద్యం, ఇసుక, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్… ఇలా ఒకటి కాదు, రెండు కాదు… నాలుగు డబ్బులు కనపడే ప్రతి వ్యవహారంలో దూరిపోయి అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినట్టు నివేదిక వచ్చిందని అంటున్నారు. అలాగే….పార్టీ కార్యకర్తల్ని దగ్గర తీసుకోవడంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారన్న అభిప్రాంయం సీఎంకు బలంగా ఉందట. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే…. టీడీపీ విస్తృ స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అలాగే…. పనితీరు మరీ తేడాగా ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి ప్రస్తుతం రోజూ కొందరితో మాట్లాడి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో… ఇప్పుడీ సర్వేలు, సీఎం వార్నింగ్స్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అటు టీడీపీ వర్గాలు కూడా… ఏంటి…. మన ఎమ్మెల్యేల మీద మరీ ఇంత బ్యాడ్ ఉందా అంటూ నోరెళ్ళబెడుతున్నట్టు సమాచారం.
Read Also: Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!
నిజంగానే ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందా అంటూ పరస్పరం ఆరా తీసుకుంటున్నారట పార్టీ నాయకులు. అదే క్రమంలో… కొందరి తీరు మరీ దిగజారడం వల్లే… సీఎం పదేపదే అంత సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారట. తాజాగా పార్టీ మీటింగ్‌లో కూడా ఆయన అంత సీరియస్ అవడానికి అదే కారణం అంటున్నారు. అలాగే పార్టీ మీటింగ్‌కు డుమ్మా కొట్టిన వాళ్ళ మీద కూడా మునుపటికి భిన్నంగా ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారాయన. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్‌కు రాకుంటే ఎలా? ఒకవేళ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉంటే… ఇక అక్కడే ఉంటే మంచిదని అన్నారంటే… మేటర్ ఎంత సీరియస్‌గా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
Read Also: Tirumala Model Hotel: ఇదేం అరాచకం..? తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.!
మొత్తంగా తన దగ్గరున్న డేటా ఆధారంగానే చంద్రబాబు మాట్లాడుతున్నారనే అభిప్రాయం టిడిపి సర్కిల్స్‌లో బలపడుతోంది.2029 టార్గెట్ గా ఇప్పటినుంచే ఎమ్మెల్యేల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట బాబు. ఇక బ్యాడ్ రిపోర్ట్ ఉన్నవాళ్ళని చూసీ చూడనట్టు వదిలేయకుండా…బెండు తీయాలని డిసైడైనట్టు సమాచారం. తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని,వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల మీద ఇంత డీప్‌గా ఫోకస్ పెట్టడం మాత్రం ఇదే మొదటి సారి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది టీడీపీ సర్కిల్స్‌లో. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు మారతారా… మారినట్టు నటిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?