Off The Record: వీధికెక్కిన వరంగల్ కాంగ్రెస్ పోరు.. అధిష్టానం ఏం చేస్తుంది..?
- వీధికెక్కిన ఓరుగల్లు కాంగ్రెస్ పోరు..
- క్రమశిక్షణ ఉల్లంఘనను సహించబోనన్న ఇన్ఛార్జ్ మీనాక్షి..
- నెల నుంచి అదుపు తప్పిన వరంగల్ కాంగ్రెస్ వ్యవహారాలు..
- ఒకరు లేఖ రాస్తే ఇంకొకరు మాటల తూలుడు..
- కొండా ఫ్యామిలీ ఒకవైపు, మిగతా ఎమ్మెల్యేలు ఒకవైపు..
- రేవూరికి కొండా సురేఖ వార్నింగ్‌తో మొదలైన రచ్చ..
- కొండా మురళి వ్యాఖ్యలతో పీక్స్‌కు గొడవ..
- క్రమశిక్షణ కమిటీకి మురళి లేఖతో ముదిరిన వివాదం..
- కొండా వ్యతిరేకుల ప్రత్యేక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు… ఇప్పుడు వీధికెక్కింది. అది ఏ రేంజ్‌లో అంటే….చివరికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సవాల్ చేసేంతలా. దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో… క్రమశిక్షణ ముఖ్యం, ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదంటూ… చాలా గొప్పగా చెప్పేశారు. కానీ…ఇప్పుడు వరంగల్ నాయకుల తీరు చూస్తుంటే మాత్రం… అవన్నీ ఉత్తుత్తి కబుర్లేనా? కాంగ్రెస్ కల్చర్ ఇక ఎప్పటికీ మారదా అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అంతకు ముందే రచ్చ జరుగుతున్నా… గడిచిన నెల రోజులుగా మాత్రం వరంగల్ కాంగ్రెస్ నేతల లొల్లి అదుపుతప్పి పతాక స్థాయికి చేరిందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళంతా… క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు. కమిటీ ముందుకు వచ్చారు. వివరణలు ఇచ్చుకున్నారుగానీ…. సీన్‌లో మాత్రం మార్పు లేదు. దేని దారి దానిదే అన్నట్టుగా ఉంది వ్యవహారం.
Read Also: Sunny Leone : కత్తిలాంటి అందాలతో సన్నీలియోన్ రచ్చ..
Also Read
దీంతో ఈ గొడవల్ని ఇలాగే… పార్టీ నాయకత్వం చూస్తూ ఉంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయట పార్టీ కేడర్‌లో. ఒకరు లేఖ ఇస్తే..ఇంకొకరు మీడియా ముందు మాటలు. ఇలా… ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్‌లో కొండా ఫ్యామిలీ ఒకవైపు… మిగిలిన ఎమ్మెల్యేలంతా…ఇంకో వైపు అన్నట్టు మారింది. ఒకరు తమలపాకుతో ఒకటి అంటే… ఇంకొకరు తలుపు చెక్కతో నాలుగంటున్నారు. మాటల యుద్ధం ముదురుతూ…చినికి చినికి గాలి వానలా మారింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ వార్నింగ్‌తో మొదలైంది రచ్చ. అక్కడ అంటుకున్న అగ్గి…ఆ తర్వాత ఏ మాత్రం తగ్గకుండా… సెగలు పొగలు రేగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్, కడియం శ్రీహరి మీదుగా… ప్రయాణిస్తున్న టైంలోనే మేటర్‌లోకి మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరింత పెట్రోల్ పోశారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కడియం,నాయిని రాజేందర్ రెడ్డి మీద కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ…పంచాయతీ పీక్స్‌కు చేసింది. అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న లొల్లి కాస్తా…ఆ తర్వాత వీధికెక్కింది. అట్నుంచి క్రమశిక్షణ కమిటీకి చేరింది. ఇక కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖ వివాదాన్ని ముదిరి పాకాన పడేలా చేసింది. అటు జిల్లా నాయకుల లొల్లిలోకి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటిని కూడా లాగారు.
Read Also: Banakacherla Project: ఏపీకి షాకిచ్చిన కేంద్రం..! బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి ..
జిల్లా శాసనసభ్యులందరిమీద రాసిన ఆరు పేజీల లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ బయటకు రావడంతో… అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మరుసటి రోజే… ఆయన వ్యతిరేకవర్గం అంతా ఓరుగల్లులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి… పార్టీకి డెడ్ లైన్ పెట్టింది. జులై 5 లోపు మురళి మీద చర్యలు తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చింది. దీంతో వ్యవహారం మరింత సీరియస్‌గా మారిపోయింది. అయితే కాంగ్రెస్ నాయకత్వం అలాంటి చర్యలకు సిద్ధంగా ఉందా..? సొంత పార్టీ నేతలే… కొండా ఫ్యామిలీ కావాలా…మేం కావాలో తేల్చుకోండని పెట్టిన గడువును రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ క్రమంలో అధిష్టానం ఏం చేయబోతోందా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. అటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కి ఫిర్యాదు చేసినా… వ్యవహారం జీడిపాకం సీరియల్ మాదిరిగా సాగుతుండటం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మీద ఎవరి కంట్రోల్ లేదా..? పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహారం ఉంటే…ఇంకా నోటీసులు… పిలిచి మాట్లాడ్డాల్లాంటివి ఏంటి? ఇలాంటి చర్యలు ఏ మేరకు సమస్యను పరిష్కరిస్తాయన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయట.
సొంత పార్టీ నేతలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. దానికి కొండా ఏం వివరణ ఇస్తారన్న చర్చ జరుగుతుండగానే… వ్యతిరేక శిబిరం పార్టీకి డెడ్ లైన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు పార్టీ నాయకత్వం ఏం చేయబోతోందన్నది సస్పెన్స్ అయింది. కానీ ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే మాత్రం… నష్టం జరగక మానదని అంటున్నారు నాయకులు. ఈ పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ మీనాక్షి ఏం చేస్తారు..? కట్టడి చేస్తారా..కలహాల కాపురాన్ని అలాగే వగిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!