తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులను నిర్వీర్యం చేసి.. పాలక మండలిని అవమానకరంగా దూషించాలని తిరుపతి తిరుమలలో అదేపనిగా చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.. మంత్రి ఆనం రామానారాయణరెడ్డి
కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.. బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉంటాం.. బెల్టుషాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.. అయితే, ప్రకాశంజిల్లాలో బెల్టుషాపు కారణంగా టీడీపీలోని రెండు గ్రూపులు పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు చేసుకొని తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు..
లిక్కర్ స్కాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇక, ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే..
ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ కూటమిలోని మరో ఎమ్మెల్యే గళం ఎత్తారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ తో ఏకీభవించారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు... ఉదయంపూట విజయవాడకు విమాన కనెక్టివిటీ లేదన్న ఆయన.. విజయవాడలో పార్టీ మీటింగ్ లు, ప్రభుత్వ అవసరాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలను ముఖం మీద అడగలేకపోతున్నాయి.. కానీ, వ్యాపార వర్గాలు సహా అందరూ విశాఖను పూర్తిగా వదిలేశారని అభిప్రాయంతో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్లోకి ప్రవేశించిన ప్రిన్సిపాల్.. అర్థరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట.. అయితే, అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపాల్ వర్మను నిర్భందించారు..
ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది... అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది... అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.. రేపు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దాం అంటూ ప్రకటన విడుదల చేశారు..