Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..! బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి..?
- కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారా జీవన్ రెడ్డి?
- పార్టీపై అసంతృప్తికి కారణాలు ఏమిటి?
- బీఆర్ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు
- తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. హస్తం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పార్టీ అధిష్టానం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని, సముచిత స్థానం కల్పించడంలో అధిష్టానం విఫలమైందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట కొనసాగడం కంటే బయటకు రావడమే మేలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
RRR Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.!
జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి, తన అనుచరులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకోవాలని ఆయన యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయకుండా దూరంగా ఉండటం, ఈ మార్పుకు బలమైన సంకేతంగా కనిపిస్తోంది.
viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!
జీవన్ రెడ్డి అసంతృప్తిపై కాంగ్రెస్ అధిష్టానం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఆయనకు పార్టీలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే , ఎంపీ టికెట్లు ఇచ్చి అన్ని విధాలా గౌరవించామని, అయినప్పటికీ ఆయన పలుమార్లు పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల అధిష్టానం కూడా ఆయన విషయంలో కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వెళ్ళిపోయినా పెద్దగా నష్టం లేదనే ‘వేచి చూసే ధోరణి’ని కాంగ్రెస్ అవలంబిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డికి దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన గనుక పార్టీని వీడితే జగిత్యాల , చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కొంత మేర ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏదేమైనా, ఉగాది పండుగ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!