Rottela Panduga: కులమతాలకు అతీతంగా.. మతసామరస్యాలకు ప్రతీకగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ జరుగుతుంది. మొహరం సందర్భంగా జరిగే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. 6 నుంచి జరిగే రొట్టెల పండుగని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసలు రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు అనడానికి ఒక స్టోరీ ప్రాచుర్యంలో ఉంది. 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మతప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పాలించేవారు. కాగా, సౌదీ నుంచి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గరి కొడవలూరుకు వెళతారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడతారు. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేస్తాయి. ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి. స్థానికులు ఆ ప్రదేశాలలోనే వారికి సమాధులు కట్టేస్తారు. అలా ఆ దర్గాకు బారాషహీద్ దర్గా అని పేరు వచ్చింది.
Read Also: Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
ఇక, దర్గా ప్రాంగణంలోని బారాషహిధులను దర్శనం చేసుకుని.. అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకొని అది నెరవేరితే మరుసటి ఏడాది వచ్చే ఆ రొట్టెను వదులుతామని భక్తులు కోరుకుంటారు. అలా సంతాన రొట్టె.. ఆరోగ్య రొట్టె.. చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె.. 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ మార్పిడి చేసుకుంటూ ఉంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఐదు రోజులు పాటు నిర్వహిస్తున్నారు.
Read Also: Allahabad High Court: శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా కేసులో హిందూ పక్షానికి ఎదురుదెబ్బ..
రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం సానపు గదులు మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులతో పాటు టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టింది. దొంగతనాలు దొరక్కుండా పోలీస్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. ఈ ఐదు రోజులు పాటు పారిశుద్ధ్య నిర్వహణపై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి రోజున సందల్ మాలి, రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత గంధాన్ని భక్తులకు పంచి పెడతారు.. మూడో రోజు రొట్టెల పండుగ.. ఇలా ఐదు రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ ఐదు రోజులు నెల్లూరుకి వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది..