కూటమిలో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఇంఛార్జ్ మంత్రిగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఏ పార్టీల మధ్య చిన్న, చిన్న విబేధాలు సహజం అన్నారు.. ఇవన్నీ ఒక కుటుంబంలో సభ్యుల మధ్య జరుగుతున్నవే.. అవన్నీ చర్చించుకుని అందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఏరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్కి దృష్టికి తీసుకెళ్లారు.. నా అన్వేషణ ఫేం అన్వేష్.. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.. నా అన్వేష్ పోస్టు చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. "బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత.. నిరాశలోకి నెట్టబడుతున్నారు.. నేను వందలాది హృదయ విదారక కథలను వింటున్నాను. ఇది ఆపాలి.
న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జడ్జీలకు బాధ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్రపతిని ఆదేశిస్తోంది.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని కామెంట్ చేశారు.. అయితే, ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుపై దాడిగానే భావిస్తున్నాం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కె.రామకృష్ణ..
ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటా.. తప్పుడు కేసులు పెట్టడం వల్ల భయపడిపోతాం అనేది మీ భ్రమ మాత్రమే అంటూ కౌంటర్ ఎటాక్…
రేపు 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' కార్యక్రమం నిర్వహణకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి నారాయణ..
మేయర్ అవిశ్వాస పరీక్ష ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక.. ఆమె, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఇక్కడ చర్చగా మారింది..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంత బాబు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా రాజమండ్రికి చెందిన మొక్కల సుబ్బారావును నియమించారు.
అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
వివిధ ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పౌర సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది.. అయితే, ఈ సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలతో పాటు.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.