Mango Farmers: మామిడి ఈసారి రైతులను నట్టేట ముంచేసింది.. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60-రూ.70 పలికి.. వినియోదారుడి జేబు చిల్లు పెట్టినా.. హోల్‌సెల్ మార్కెట్‌లో కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. కనీసం పెట్టుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ తరుణంలో మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..
Read Also: CUET UG 2025: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి ఉత్పత్తి జరుగుతుండగా.. గత నెల 23న మామిడి రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మామిడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.. మామిడి రైతులను రోడ్డున పడేస్తున్న వైసీపీ మాఫీయాకు అండగా నిలబడేందుకే వైఎస్ జగన్.. బంగారుపాళ్యం పర్యటన అంటూ ప్రభుత్వం వర్గాలు దుయ్యబడుతున్నాయి..
Read Also: Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!
ఇక, కుప్పం పర్యటనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం అయిన సీఎం చంద్రబాబు.. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం విదితమే..