Off The Record: ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఎక్కువగా రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ప్రభుత్వాలు మారినప్పుడు ఒకరిద్దరు ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇబ్బందులు పడటం, వివాదాల్లో ఇరుక్కోవడం గతంలో కూడా ఉన్నా… ఇప్పుడు అదే పెద్ద వ్యవహారంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. అదంతా….రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయిందని కూడా విశ్లేషిస్తున్నారు కొందరు. సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుతో పాటు విశాల్ గున్ని, కాంతిరాణా టాటా లాంటి కొంతమంది అధికారులు ఒక కేసుకు సంబంధించి విచారణలు ఎదుర్కోవటంతో పాటు ముందస్తు బెయిల్స్ తెచ్చుకున్న పరిస్థితి. అటు ఏపీపీఎస్సీ కేసులో పీఎస్సార్ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇక తాజాగా యువ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన పదవికి రాజీనామా చేశారు. చాలా సర్వీస్ ఉన్న యువ అధికారి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే… వెనక ఎంత బలమైన కారణాలు ఉన్నాయోనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.
Read Also: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
ఒకరు రెడ్ బుక్ అంటూ…మరొకరు మేం మళ్ళీ వస్తే…సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకు వస్తామంటూ…సినిమా చుపిస్తామంటూ ఇస్తున్న స్టేట్మెంట్స్ అధికారుల్లో కూడా గుబులు పుట్టిస్తున్నాయన్నది లేటెస్ట్ టాక్. ఎంతో కష్టపడి చదువుకుని ఒక పొజిషన్‌కు వచ్చి, డ్రీమ్ జాబ్ చేస్తూ… ఇలా రాజకీయ చట్రంలో బందీ అవ్వడం ఎందుకని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఐపీఎస్‌లతో పాటు చాలామంది ఐఎఎస్‌లలో కూడా ఇదే అభిప్రాయం ఉందట. పోస్టింగ్ లేక కొంతమంది, ఇచ్చినా…. అప్రాధాన్యత శాఖలో ఉండి మరి కొంతమంది ఇబ్బందులు పడుతున్నారట. ఇలాంటి వ్యవహారాలు అధికారుల మీద ప్రభావం చూపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. 2019లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పుడు సీఎస్‌గా ఉన్నారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని కూడా చెప్పుకున్నారు. కానీ… సడన్‌గా ఎల్వీని అప్రాధాన్య పోస్ట్‌కు బదిలీ చేయడం అప్పట్లో కలకలం రేపింది. సీనియర్ ఐపీఎస్… ఏబీ వెంకటేశ్వరరావు కూడా అప్పట్లో ప్రభుత్వం తనను వేధించిందని చెప్పారు. ఇక రాష్ట్రంలో అధికారం మారాక.. టీడీపీకి తొత్తుగా ఉన్నారని ఆరోపిస్తూ… అప్పటి తిరుపతి ఎస్పీ ఉన్న సుబ్బారాయుడుకు జగన్ సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. ఇలాంటి వ్యవహారాలన్నీ కలగలిపి ఇప్పుడు ఏపీ ఆలిండియా ఆఫీసర్స్‌లో చర్చనీయాంశం అయ్యాయట.
Read Also: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
ఇప్పటికీ కొంత మంది అధికారులు ఎలాంటి పోస్టింగ్ లేక ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓవైపు ఆలిండియా సర్వీస్ అధికారుల కొరత ఉందని అంటూనే… మరోవైపు ఉన్నవాళ్ళని సమర్ధంగా ఉపయోగించుకోలేకపోవడం ఏంటంటూ మాట్లాడుకుంటున్నారట. కొంతమంది సీనియర్స్ సమావేశాలు పెట్టుకుని ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చర్చంచుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వాలు చెప్పినట్టల్లా చేసేసి… పెట్టమన్న దగ్గరల్లా సంతకాలు పెట్టడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని, దానికి బదులు బిజినెస్ రూల్స్‌ని ఫాలో అయితే ఇబ్బందులు ఉండవని మాట్లాడుకున్నారట. పరిస్థితి ఇలాగే… కొనసాగితే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే తేడా లేకుండా మనం ఎప్పటికీ బాధితులుగానే మిగిలిపోతామని, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీనియర్ ఆఫీసర్స్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చ జరుగుతోందట ఆఫీసర్స్ సర్కిల్స్‌లో. ముఖ్యంగా రూల్ పొజిషన్ పక్కన పెడితే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీనియర్ ఆఫీసర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ కేడర్ ఆలిండియా సర్వీస్ ఆఫీసర్స్ అయితే… రాజకీయ చట్రం నుంచి బయటపడాలని భావిస్తున్నారన్నది లేటెస్ట్ హాట్.