AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. త్వరలో ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై విధివిధానాలను రూపొందించనుంది.. వాటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత.. ఇళ్ల స్థలాలపై ఓ నిర్ణయం తీసుకోనుంది కూటమి ప్రభుత్వం..
Read Also: US Debt Hits Record: అప్పుల కుప్పగా అగ్రరాజ్యం అమెరికా.. కారణం ఇదేనా..?
కాగా, రెవెన్యూశాఖ పని తీరు.. భూ సమస్యల పరిష్కారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు.. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు.. 4 లక్షలు పైగా ఉన్నాయి. అభ్యంతరం లేని భూముల పరిష్కారం జీవో 30తో రెగ్యులైజెషన్ జరుగుతుందన్నారు.. సుపరిపాలన.. తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్దీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.. హౌసింగ్ ఫర్ ఆల్… అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. రెండేళ్లలోపు ఇంటి స్థలం.. మూడేళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.. పేదలకు ఇళ్లు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు సంబంధించి మంత్రి వర్గ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు..