Pulivendula ZPTC By-Election: కడప జిల్లాలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు.. ఉప ఎన్నికల కోసం సంబంధిత మండలాల్లో ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. పులివెందుల మండలంలో మొత్తం 10,601 ఓట్లు నమోదయ్యాయి.. ఒంటిమిట్ట మండలంలో 24,606 ఓట్లు ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా పూర్తయింది. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉన్నవారు.. జులై 19వ తేదీ వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అదే రోజు సాయంత్రంలోగా తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్షణమైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని జిల్లా పరిషత్ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ అమ్మకు వద్దు.. నాన్నకు ఇవ్వండి..! చిన్నారుల విజ్ఞప్తి