ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కర్నూలు జిల్లా కోర్టు.. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో నారాయణరెడ్డి వాహనాన్ని అడ్డగించి నరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 19 మంది నిందితులు కాగా ఒకరు…
ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న మన సాయుధ దళాలను మరియు ప్రభుత్వాన్ని నేను అభినందించాను. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా నేను సూచించాను అన్నారు.. TRFని ఉగ్రవాద సంస్థగా పేర్కొనమని భారత ప్రభుత్వం.. యూఎస్ఏని కోరాలని కూడా నేను సూచించాను. FATFలో పాకిస్తాన్ను గ్రే-లిస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు..
మొత్తం 31 అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ సాగుతోంది.. విభజన చట్టంలో రాజధాని అనే అంశం దగ్గర అమరావతి అని ఉండేలా కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్.. దీనిపై కేబినెట్లో చర్చించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉంది.. అయితే, ఈ రోజు ఏపీ కేబినెట్కు ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు..
నకిలీ ఏసీబీ అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.. నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. నకిలీ ఏసీబీ వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా చెబుతన్నారు అధికారులు..
వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.