Palnadu Crime: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు అయినా తండ్రీకొడుకులను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగుళూరులో స్థిరపడ్డారు.. అయితే, కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామి రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు వచ్చాయి.. ఇరువురికి చెందిన చెక్‌బుక్ తోసుకొని ప్రత్యర్థి భాగస్వాములు గడ్డం అనీల్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట.. ఇలా పలు ప్రాంతాలలో చెక్‌బౌన్స్ కేసులు వేశాడట..
Read Also: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు..
అయితే, ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు నరసరావుపేటలో కోర్టులో వాయిదాల నిమిత్తం బెంగుళూరు నుండి వచ్చారు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి.. నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్న హోటల్ కి వెళ్లి టిఫిన్ తిని బయటికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి పై గడ్డం అనీల్ రెడ్డి మరియు కొందరు వ్యక్తులు విరుచుకుపడ్డారు.. వారిని కిడ్నాప్ చేశారు.. ఇద్దరిని బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో దారుణంగా హత్య చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు గడ్డం అనీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రధాన అనుమనితుడుగా ఉన్న బాదం మాధవ రెడ్డి.. 2014 నుంచి 2017 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఇంఛార్జ్‌గా పనిచేశారు.. అయితే, తండ్రీకొడుకుల హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.. హత్యకు పాల్పడిన వారు, హత్య చేసిన వారు సంతమగులూరు మండలానికి చెందిన చిన్న ముఠా సభ్యులుగా సమాచారం..