ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ...ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ...పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు...కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు.
ఏపీ బీజేపీ కేడర్ని ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తోందట. కార్యక్రమం ఏదైనాసరే.... ఆ... చూద్దాంలే, చెప్పినప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులతో సహా... ఎవ్వరూ యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందులాగా... మేమున్నాం అంటూ పార్టీ కోసం ముందుకు రావడం లేదట. దీంతో చిన్న కార్యక్రమం చేయాలన్నా మందిని పోగేయడం పెద్ద టాస్క్‌గా మారిందని చెబుతున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పిసిసి కమిటీ, కేబినెట్ విస్తరణపై చర్చ నడుస్తోంది. PCC కమిటీలో పెద్దగా పోటీ దారులు ఉండకపోవచ్చు గానీ.... కేబినెట్ విషయంలో మాత్రం ఆశావాహులు ఎక్కువ. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చూస్తోంది పార్టీ. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీతో జరిగిన ప్రత్యేక భేటీలోనూ, అటు ఇతర అధిష్టానం పెద్దల దగ్గర ప్రస్తావించారట.
భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదో... ఇస్తే తీసుకున్నట్టు కాకుండా.... తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారట ఆమె. తండ్రి కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ బయటికి లీకవడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ రచ్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
విజయనగరానికి చెందిన ఉగ్రవాది సిరాజ్ విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 5 రోజులుగా సిరాజ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు, NIA అధికారులు... కుట్రకు సంబంధించిన విషయాలు కూపీ లాగుతున్నారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేయాలని సిరాజ్‌కు... సౌదీ హ్యాండ్లర్ సూచించినట్టు తెలిసింది. అయితే... విజయనగరమే తన టార్గెట్ అని హ్యాండ్లర్కు చెప్పాడట సిరాజ్.
కడప జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం అనే అజెండాతో మొదటి రోజు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు ప్రధాన అంశాలను సభ ముందు ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకులను జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం...