రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం.. అవినీతి జరగలేదని 164 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా ? అంటూ ఆయన సవాలు విసిరారు.. ఈ మధ్యే టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..
తన భార్య గురించి తప్పుగా మాట్లాడాడంటూ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో భర్త.. తన భార్యపై మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేక క్షణికావేశంలో.. చికెన్ కొట్టే కత్తితో స్నేహితుడి మెడపై దాడి చేయడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారింది.. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం సృష్టించింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ-స్టాంపుల కుంభకోణాన్ని అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్.. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో నకిలీ ఈ స్టాంప్ బాగోతం బయటపడిందని తెలిపారు.
కాలం ఏదీ మర్చిపోదు.. మనం ఒకటిస్తే.. ఆ తర్వాత రెండు తీసుకోవాల్సి వస్తుంది.. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా తన ప్రత్యర్థి ఇంటి ముందు కొలతలు వేయించి భయపడితే.. ఇప్పుడు ఆయన మాజీ అయ్యాక సీన్ రివర్స్ అయింది. అప్పుడు ఆర్.అండ్.బి వాళ్లు సీన్ లోకి వస్తే.. ఇప్పుడు మున్సిపల్ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. మున్సిపల్ ఆక్రమించారని తేలితే గోడలు పడగొట్టేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.
ఆదివారం రోజు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుండి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ కూటమి పార్టీలు మధ్య కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల... టీడీపీ ఇంచార్జ్ గండిబాబ్జీ మధ్య వర్గ విబేధాలు నడుస్తుండగా.. ఇప్పుడు మేయర్ పీలా శ్రీనివాస్ ఆ జాబితాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విధానాలను వ్యతిరేకిస్తూ కేడర్ మీటింగ్ లో ఫైర్ అయ్యారు మేయర్ పీలా. ఇంచార్జిగా గండిబాబ్జీ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్.
బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కొనసాగుతోన్న మిస్టరీ.. 17 ఏళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురికాగా ఇంకా నిందితులు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది.