‘ఇది ఐటీ, డేటా కాలం’.. స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, కృత్రిమ మేధస్సును కలిగి ఉండటం అవసరం
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 12వ సారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం గురించి నొక్కి చెప్పారు. మిషన్ మోడ్‌లో సెమీకండక్టర్లపై పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి వస్తాయన్నారు. రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 30-40 సంవత్సరాలుగా సెమీకండక్టర్లకు సంబంధించిన ఫైళ్లు నిలిచిపోయాయని తెలిపారు. ఇది ఐటీ, డేటా కాలం అని అన్నారు. స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సును కలిగి ఉండటం ప్రస్తుత అవసరం. మన పనిలో మన సామర్థ్యాలను ప్రదర్శించాలి. సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయని, ప్రపంచానికి నిరూపించామని, UPI ప్లాట్‌ఫామ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. మనకు సామర్థ్యం ఉంది. 50 శాతం రియల్ టైమ్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. మనం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని తెలిపారు.
అణు బెదిరింపులను ఇకపై సహించం.. ఎర్రకోట నుంచి పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ అల్టిమేటం
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి వరుసగా 12వసారి ప్రసంగం చేశారు. ఈ సంవత్సరం థీమ్ ‘న్యూ ఇండియా’. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందన అయిన ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక, అమలులో పాల్గొన్న సీనియర్ సైనిక అధికారులను 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్కరించారు. పాకిస్తాన్ దుష్ట కార్యకలాపాల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఆగస్టు 15వ తేదీ ప్రత్యేక ప్రాముఖ్యతను నేను కూడా చూస్తున్నాను. ఈరోజు ఎర్రకోట నుంచి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ధైర్య సైనికులకు సెల్యూట్ చేసే అవకాశం నాకు లభించింది. మన ధైర్య సైనికులు శత్రువులను వారి ఊహకు అందకుండా శిక్షించారు. సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్‌లో టూరిస్టులను ఊచకోత కోసిన విధానం. వారి మతాన్ని అడిగి చంపిన తీరు. భర్తను అతని భార్య ముందు కాల్చి చంపారు, తండ్రిని అతని పిల్లల ముందు చంపారు. దీంతో భారత్ మొత్తం పాక్ కు తగిన బుద్ది చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తగ్గేదే లే.. ట్రంప్ సుంకాల తర్వాత కూడా.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్
అదనపు సుంకాలు లేదా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నప్పటికీ, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత్ ఆపదని దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ ఎఎస్ సాహ్నీ గురువారం తెలిపారు. ఐఓసీ వంటి శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం పూర్తిగా ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుంటాయని సాహ్ని అన్నారు. రష్యన్ కొనుగోళ్లపై ఎటువంటి నిషేధం లేదని, మేము కొనుగోళ్లను కొనసాగిస్తున్నామన్నారు.
అబ్బో.. ఆ ఆటగాళ్లను మాత్రం ఇవ్వం! రాజస్థాన్‌కు చెన్నై షాక్
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను కెప్టెన్ సంజు శాంసన్ వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. తనను విడుదల చేయాలంటూ ఇప్పటికే ప్రాంఛైజీని కోరాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సంజును తీసుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంజు ట్రేడ్ కోసం ఆర్ఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంజు బదిలీ కోసం పలు ఫ్రాంచైజీలను ఆర్ఆర్ యజమాని మనోజ్ బదాలె నేరుగా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సరైన వికెట్ కీపర్, బ్యాటర్ కోసం బదాలె చూస్తున్నాడట. ఈ క్రమంలోనే సీఎస్‌కేను సంప్రదించాడట. అయితే ఆర్ఆర్ ప్రతిపాదనను సీఎస్‌కే తిరస్కరించినట్లు తెలుస్తోంది. సంజు శాంసన్ స్థానంలో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లేదా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బదిలీ కోసం సీఎస్‌కేకు ఆర్ఆర్ యజమాని మనోజ్ బదాలె ప్రతిపాదించాడు. మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబెను కూడా తీసుకునేందుకు బదాలె ఆసక్తి చూపారట. అయితే రాజస్థాన్ ప్రతిపాదనను చెన్నై సున్నితంగా తిరస్కరించింది. స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని బదాలెకు సీఎస్‌కే యజమాని స్పష్టం చేసినట్లు సమాచారం. సీఎస్‌కే, ఆర్ఆర్ మధ్య ట్రేడింగ్ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్లే.
సినిమాల్లో అవకాశం పేరుతో సె*క్స్ రాకెట్‌కు మైనర్ బాలిక అప్పగింత..! ప్రముఖ నటి అరెస్ట్..
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 14 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీనటి మిను మునీర్‌ను పోలీసులు అరెస్టుచే శారు. పోలీసుల కథనం.. పదేళ్ల క్రితం మిను మునీర్.. సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చి ఓ ప్రైవేటు హోటల్లో ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు.. నటి మిను మునీర్నును గురువారం అరెస్టు చేసి, చెన్నైకి తరలించారు.. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా 2014లో ఒక బాలికను సెక్స్ రాకెట్‌కు అమ్మేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో తమిళనాడు పోలీసులు మలయాళ నటీ మిను మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం, తమిళనాడు పోలీసుల బృందం బుధవారం రాత్రి అలువాలోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. ఫిర్యాదు ప్రకారం, మిను తన బంధువు అయిన బాలికకు సినిమా అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తమిళనాడుకు తీసుకెళ్లి, ఆపై సెక్స్ రాకెట్‌కు అప్పగించడానికి ప్రయత్నించింది. 10 ఏళ్ల తర్వాత బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా తిరుమంగళం పోలీసులు మినుపై కేసు నమోదు చేశారు.
వార్ -2 హిందీ.. 2025 బెస్ట్ ఓపెనింగ్స్ లో ఎన్నో స్థానం అంటే
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీడ్ గాడ్ కాంబోలో వచ్చిన చిత్రం వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ వార్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య, వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చింది వార్. కానీ ఓవర్సీస్ ప్రీమియర్స్ తొలి ఆట నుండే మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది వార్ 2. ఇద్దరు బడా స్టార్స్ ఉన్న కూడా కథ, కథనం అంతగా ద్రుష్టి పెట్టకుండా కేవలం యాక్షన్ పై మాత్రమే దర్శకుడు ఫోకస్ చేసాడని విమర్శలు వచ్చాయి. కానీ అవేమి వార్ 2 కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. వార్ 2 బాలీవుడ్ లో సూపర్బ్ స్టార్ట్ అందుకుంది. ఇండియా వైడ్ గా 15,583 షోస్ కు గాను రూ. 31.97Cr గ్రాస్ రాబట్టి 31.40% ఆక్యుపెన్సీ రాబెట్టింది. ముంబై లో రూ. 8.64కోట్లు ఢిల్లి రూ. 7.52 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా ఛావా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా వార్ 2 సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా వార్ 2 మొదటి రోజు రూ. 85 కోట్లకు పైగా వాసులు చేసిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. సౌత్ లో కూలీ తో భారీ పోటీలో రిలీజ్ అయినా కూడా వార్ 2 సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు కలెక్షన్స్ ఏ మేరకు రాబట్టిందో యూనిట్ వర్గాలు అధికారకంగా ప్రకటిస్తారేమో చూడాలి