ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదలు పొంగి ప్రవహిస్తున్నాయి.. ఇక, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.. ఈ రోజు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు.. మరోవైపు, పై నుంచి వస్తున్న వరదలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతుంది.. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,20,531 క్యూసెక్కులుగా ఉంది.. దీంతో, కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్..
పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీ గెలవడమే కష్టమనే పరిస్థితి నుంచి.. అసలు వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు.. 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో, టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే.. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది.. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ.. తెలుగుదేశం పార్టీ వశమైంది.. అయితే, 2016లో తప్ప.. మిగిలిన ఐదుసార్లు వైఎస్ ఫ్యామిలీ పెట్టిన అభ్యర్థులే పులివెందుల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు.. కానీ, 2016లో నామినేషన్ వేసింది టీడీపీ.. అయితే, పోలింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. కానీ, బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు ఉండటంతో టీడీపీకి ఏకంగా 2,500 ఓట్లు వచ్చాయి..
పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది.. ఇది జగన్ అహంకారానికి చెంపదెబ్బ..!
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు.. మూడున్నర దశాబ్దాల తర్వాత భయం లేకుండా ఓటేసిన పులివెందుల ప్రజలదే ఈ గెలుపు అని అభివర్ణించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సాధించిన ఘన విజయం ఏడాది పాలనకు ఇది రెఫరెండమని పేర్కొన్న ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకానికి, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం అన్నారు.. ఈవీఎంలతో మాయ జరుగుతుందంటూ అక్కసు వెళ్లగక్కుతున్న జగన్… బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ప్రజాస్వామ్య విజయానికి ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.. ఇప్పటికైనా అర్థమైందా రాజా.. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో..? నీ అరాచక నాయకత్వానికి ప్రజలు గుడ్‌బై చెప్పారు.. బైబై జగన్..! అని కామెంట్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
మీరు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. ప్రశ్నలు మురిగిపోతున్నాయి..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు.. గత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది.. గత ప్రభుత్వంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా తుప్పుపట్టాయి.. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 75 రోజులు పనిదినాలు మాత్రమే నడిచాయి.. భారతదేశంలో ప్రతి అసెంబ్లీ తక్కువలో తక్కువ 60 రోజులు జరగాలి అని పాట్నాలో తీర్మానించాం.. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికీ 31 రోజులు సమావేశాలు జరిగాయని తెలిపారు..
హైదరాబాద్‌లోకి భారీగా చొరబడ్డ బంగ్లాదేశ్ వాసులు.. 20 మంది అరెస్ట్!
హైదరాబాద్ నగరంలోకి బంగ్లాదేశ్ వాసులు భారీగా చొరబడ్డారు. హైదరాబాద్, సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. హైదరాబాద్‌లోకి అక్రమంగా వచ్చిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే 20 మంది అక్రమ బంగ్లాదేశ్ వలస దారులను పోలీసులు పట్టుకున్నారు. 20 మంది బంగ్లాదేశ్ వాసులను పట్టుకొని.. భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎఫ్‌కు తెలంగాణ పోలీసులు అప్పగించారు. హైదరాబాద్ నగరంలో ఇదివరకే పలుమార్లు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్రమ వలసదారులను బీఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గతేడాది బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో భారతదేశంకు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోకి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్నారు.
ఫ్యాన్సీ నంబర్ల ప్రియులకు షాక్.. రెండురెట్లు ఫీజులు పెంపు!
ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ను తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అందరికంటే ప్రత్యేకంగా నిలబడాలని కూడా మరికొందరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చయినా చేస్తారు. అలాంటి వారికి తెలంగాణ రవాణాశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులను రవాణాశాఖ భారీగా పెంచింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు చెల్లించాల్సిన ఫీజులు భారీగా పెరిగాయి. ఇదివరకు ఐదు శ్లాబులుగా ఉండగా.. ఇప్పుడు ఏడుకు పెరిగాయి. గతంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం రూ.50 వేలు ఉన్న ధర.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు పెరిగింది. అంటే రెండురెట్లు ఫీజు పెరిగిందన్నమాట. అలానే రూ.40 వేలు ఉన్న ఫీజు లక్ష రూపాయలకు, రూ.30 వేలు ఉన్న ఫీజు యాభై వేలకి పెరిగింది. రూ.20 వేల ఫీజును రూ.40000కి.. రూ.10 వేల ఫీజును రూ.30000కి.. రూ.5వేల ఫీజును రూ.6000కి పెంచారు. దాంతో ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి ఉన్నవారికి ఆర్థిక భారం మరింత పెరగనుంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది.
పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసి రావట్లేదా..?
చిట్టిగా ఓవర్ నైట్‌లో యూత్ క్రష్‌గా మారింది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలుతో తెలుగు పరిశ్రమకు మరో టాలెంట్ లోకల్ యాక్ట్రెస్ దొరికేసింది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన విజయాలు అందించలేదు. అక్కినేని హీరోలతో ఛాన్స్ వచ్చిందీ కానీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజులో జస్ట్ క్యామియో రోల్స్‌తో సరిపెట్టేసుకుంది. లైక్ అండ్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు ప్లాప్ టాక్ తెచ్చాయి. కల్కి2898ఏడీతో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చినా ఫరియాకు పెద్దగా యూజ్ కాలేదు. మత్తు వదలరా2తో బ్లాక్ బస్టర్ అందుకుంది. మత్తువదలరా2తో గట్టి కంబ్యాక్ కొట్టిన తర్వాత కూడా ఫరియాకు లక్ కలిసి రావట్లేదు. బిగ్ హీరోల ఆఫర్స్ కోసం చూస్తే ఫేట్ మరోటి డిసైడ్ చేస్తోంది చిట్టి విషయంలో. ఎస్టాబ్లీష్ కానీ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. పోనీ కోలీవుడ్ చెక్కేద్దామంటే అక్కడ గడ్డుకాలం ఎదురౌతుంది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన వల్లిమయిల్ చేసింది బ్యూటీ. షూటింగ్‌కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టారు కానీ విడుదలకు నోచుకోవడం లేదు. కోలీవుడ్ ఎంట్రీ కూడా మరింత ఆలస్యం అయ్యేట్లే కనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేడమ్‌కే క్లారిటీ లేదు. తెలుగులో ఎప్పుడో కమిటైన భగవంతుడు ఎంత వరకు వచ్చిందో నయా అప్డేట్ లేదు. ఇక ఓటీటీ హీరోగా బ్రాండ్ వేయించుకున్న నరేష్ అగస్త్యతో గుర్రం పాపిరెడ్డిలో జోడీ కడుతోంది. అడల్ట్ కామెడీగా వస్తోన్న రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌తో టచ్ పోకుండా ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఫరియా.
బంగారం, వెండి ధరల్లో బిగ్ చేంజ్!.. ఈరోజు తులం ఎంతంటే?
గత కొన్ని రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,135, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,290 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
నటుడు దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. తీవ్రమైన కేసుల్లో బెయిల్ ఇవ్వడం అన్యాయమే
కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో కొత్త అప్‌డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు బిగ్ షాకిచ్చింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం దానిని రద్దు చేసింది. 2024లో బెంగళూరులో అరెస్టు చేసినప్పుడు ఈ హత్య కేసులో నటుడు నిందితుడిగా ఉన్నాడు. దర్శన్ భార్య పవిత్ర గౌడకు రేణుక అభ్యంతరకరమైన సందేశాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. పవిత్ర గౌడతో సహా చాలా మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
హిట్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉన్న యువ దర్శకులు
మణిరత్నం, శంకర్, గౌతమ్ వాస్ దేవ్ మీనన్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిలవుతున్నారు. కాస్తో కూస్తో లోకేశ్, నెల్సన్, వెట్రిమారన్ తమిళ ఇండస్ట్రీని నిలబెట్టే బాధ్యతను తీసుకుంటున్నారు. డైనమిక్ దర్శకుల కొరత తమిళ ఇండస్ట్రీలో కొరవడుతున్న టైంలో యంగ్ డైరెక్టర్ల విప్లవం స్టార్టైంది. అరుణ్ మాథేశ్వరన్, అశ్వత్ మారిముత్తు లాంటి వర్సటైల్ డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు. వీరితో పాటు మరికొంత మంది న్యూ కమ్మర్స్ కూడా తోలి సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నారు. కానీ రెండవ సినిమా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డును దక్కించుకున్న తమిళ ఫిల్మ్ పార్కింగ్. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకుడు. అతడి టాలెంట్ గుర్తించి శింబు ఛాన్స్ ఇచ్చాడు.. కానీ సడెన్లీ మధ్యలోకి వెట్రీ రాకతో శింబు 49 పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే లబ్బర్ పందుతో మంచి విజయాన్ని నమోదు చేసిన తమిళరసన్ పచ్చముత్తు నెక్ట్స్ సినిమా కోసం కథ రెడీ చేసుకుని ధనుష్ కాల్సీట్లు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ధనుష్ ఫుల్ బిజీ. మహారాజాతో విజయ్ సేతుపతి ఖాతాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ఇచ్చిన నితిలన్ స్వామినాథన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. నయనతార, రజనీకాంత్‌తో సినిమాలన్న వార్తలే కానీ ఏదీ స్టార్టైన దాఖలాలు లేవు. ఇక రీసెంట్ హిట్ టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వీళ్లే కాదు ఈ జాబితాలో మరికొంత మంది ఫ్రూవ్డ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీరంతా కథలు లేక కాదు స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. టాలెంట్ యువ దర్శకులున్నా సరిగ్గా వినియోగించుకోవడంలో తడబడుతోంది కోలీవుడ్. మరీ ఈ బాలారిష్టాలను ఈ డైరెక్టర్స్ ఎప్పుడు అధిగమిస్తారో.