గాలి జనార్దన్ రెడ్డి తరహాలో లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ కో కూడా జైలుకు వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో ఇవాళ ఆయన పలు కాలనీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ కడపలో మహానాడు అత్యంత ఘనంగా జరిగిందని 7 నుంచి 8లక్షల మంది జనం పాల్గొన్నారన్నారు. ఇది చూసిన వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందన్నారు.
చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు.. తప్పుడు కేసులు పరాకాష్టకి చేరాయి..
భారత్‌పై మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దేశంలో 2,710 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, అంతకుముందు రోజు కంటే 511 కొత్త కేసులు పెరిగాయి. కరోనా బారినపడి ఏడుగురు మరణించారు.. దీంతో, ఈ ఏడాది కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 22కి చేరుకుంది..
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది..
ఏలూరు కలెక్టరేట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది.. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పీజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. చేనేత దగ్గర్నుంచీ వైద్యసేవల వరకూ అన్ని రంగాలనూ అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి... కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు..