Shyamala: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారు అంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.. అంతేకాదు.. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.. తాజాగా, రాష్ట్రంలో వెలుగు చూసిన కొన్ని ఘటనలపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళల బాధ్యత మాది అన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గత 15 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. కూటమి ఎమ్మెల్యేలు అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారు.. మాట వినని అధికారులను వేధిస్తున్నారు.. మహిళా ఉద్యోగులపై ఎమ్మెల్యేల దాష్టీకాలు పెరుగుతున్నాయి.. ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అర్థరాత్రి మహిళా ఉద్యోగిని కార్యాలయాలకు రమ్మంటున్నారు.. అర్ధరాత్రి వీడియో కాల్స్ చేస్తున్నారు.. మాట వినకపోతే సస్పెండ్.. బదిలీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Tollywood Bandh : సినీ కార్మికుల సమ్మెపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కీలక కామెంట్స్….
చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను తమ చెప్పు కింద పెట్టుకుంటున్నారని మండిపడ్డారు శ్యామల.. చిన్న పని కావాలన్నా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చుట్టూ మహిళలు ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి.. బాధితులు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించటం లేదు.. తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారు.. కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు రాజీ చేసుకోమని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు.. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.. ఎమ్మెల్యే ఆదిమూలం ఉదంతంతో పాటు ఇప్పుడు కూన రవికుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ కూడా ఇదే తరహా వ్యవహారాలు చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల దెబ్బకి మహిళలు హడలిపోతున్నారు.. మహిళల వ్యక్తిత్వ హననం చేయటం ఆనవాయితీగా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Gold Rate Today: శుభవార్త.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఇవే
ఇక, గతంలో మహిళా తహసీల్దార్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని వేధిస్తే చంద్రబాబు రాజీ చేశారు.. ఎమ్మెల్యేలతో పోరాడటం నా వల్ల కావటం లేదంటూ.. మహిళలు ఆత్మహత్యాయత్నాలు చేసే పరిస్థితికి వచ్చింది.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మహిళా హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు శ్యామల.. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారంటూ.. గతంలో ఓ సినిమా ఈవెంట్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై చురకలు అంటించారు.. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ ఉండేది.. దాన్ని నిర్వీర్యం చేసి శక్తి యాప్ తెచ్చారు.. ఆ యాప్ పనిచేయదు.. దాని నుంచి ఫిర్యాదులు తీసుకోరని ఆరోపించారు.. మా ప్రభుత్వానికి సత్తా లేదని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో నేరుగా చెప్పారని పేర్కొన్నారు.. మహిళల్ని వేధించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, వైసీపీ పోరాటం చేస్తే తప్ప బాధితులకు న్యాయం జరగటం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోకొల్లలుగా మహిళలపై వేధింపుల ఘటనలు పెరిగిపోయాయి.. మా పార్టీ దళిత నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
Read Also: INDIA Bloc: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న కూటమి.. రేసులో శివ!
టీడీపీ ఎమ్మెల్యే నజీర్ మహిళతో అసభ్యంగా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో అందరూ చూశారు.. ప్రజాప్రతినిధులుగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలంటున్నారు..? అని నిలదీశారు శ్యామల.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులను వేధించారు.. ఫ్రీ బస్సు అన్నారు.. కొన్ని బస్సులకు పథకం వర్తించదు అని బోర్డులు పెడుతున్నారు.. మాటలు చెప్పటం తప్ప చేసే పనిలో సమర్ధత లేదు.. ఏ వీడియో బయటకు వచ్చినా మార్ఫింగ్ అని చెప్పి దాట వేస్తున్నారు.. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా వైసీపీ మహిళా నేతలు వెళ్లి అండగా ఉంటున్నారని వెల్లడించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల..