Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం రోజు తీర్పును వెలవరించింది ఏపీ హైకోర్టు.. అయితే, కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. వివిధ కోర్టుల్లో బెయిల్ దొరికింది.. దీంతో, 85రోజులుగా జైల్లో ఉన్న కాకాణి గోవర్దన్‌రెడ్డి ఈ రోజు జైలు నుంచి విడుదల కాబోతున్నారు..
Read Also: Miss Universe India 2025: ‘మిస్ యూనివర్స్ ఇండియా’గా మణిక విశ్వకర్మ!
అయితే, కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది హైకోర్టు.. ఆ షరతులను పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.. పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు విచారణ అధికారి ముందు హాజరుకావాలి.. దర్యాప్తు పూర్తయి, ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు జిల్లాలోకి ప్రవేశించడానికి వీల్లేదు.. విచారణ అధికారి అనుమతి లేకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లరాదు. పాస్‌పోర్ట్‌ను దర్యాప్తు అధికారికి అప్పగించాలి.. కోర్టు విధించిన షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయబడుతుంది అంటూ.. బెయిల్ ఇచ్చే సందర్భంలో పేర్కొంది ఏపీ హైకోర్టు..
Read Also: Mithun Chakraborty : 45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !
ఇక, జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గూడూరులో ఉండే అవకాశం ఉందంటున్నారు.. చార్జ్ షీట్ దాఖలు చేసే వరకు జిల్లాలో ఉండకూడదని హైకోర్టు షరతులు విధించిన నేపథ్యంలో.. తిరుపతి జిల్లా గూడూరుకి కాకాణి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.. గూడూరులో ఓ నేతకు సంబంధించి ఇంటిని సిద్ధం చేస్తున్నారట కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు..