తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన శిక్షలు తప్పదని హెచ్చరించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శాంతారాం, నరేష్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా టీటీడీపై దుష్ప్రచారం చేస్తోందని.. వాటిపై పాలకమండలిలో చర్చించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కువైట్ నుంచి వచ్చాడు అల్లుడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి.. తన కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని వేట కొడవలితో విచక్షణ రహితంగా హత్య చేశాడు మహబూబ్ భాషా అనే వ్యక్తి... కడప నగరంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న చాంద్ బాషా అనే వ్యక్తిని ఓ విందు కార్యక్రమంలో ఉండగా అక్కడి నుండి కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసిన మామమహబూబ్ బాషా.. తన ఇంట్లో, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వేట కొడవలితో అతి దారుణంగా హత్య చేశారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాతా హోటల్ పక్కన జంపాలవారిపాలెంలో టీడీపీ నేత తోపూరి నరసింహం అనే వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు బ్రహ్మయ్య అనే వ్యక్తి.. అంతటితో ఆగకుండా.. రెండు రోజులు నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు.
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.. పెద్దపప్పురు మండలం తిమ్మనచెర్వుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టుబడి మనోజ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల డ్రైవర్ రాజు, అతని తమ్ముడు కలిసి దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో మనోజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అతడి శరీరంపై కత్తిగాట్లు కనిపిస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి రేషన్ దుకాణాల్లో వస్తువులు ఇవ్వడం ప్రారంభమైంది.. వాహనాల్లో కాకుండా రేషన్ షాపుల్లోనే ఇకనుంచి ఆయా వస్తువులు ఇవ్వనున్నారు.. దీంతో వైసీపీ-టీడీపీ నేతలు మధ్య పరస్పరం విమర్శలు మొదలయ్యాయి.
చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది..! ఏడాది కాలంలో చంద్రబాబు ప్రజలకు వెన్ను పోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు.. మహానాడు వేదికగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు.. ప్రజలకు ఇబ్బంది కలగ కూడదని ఇంటింటికి రేషన్ ను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.. కానీ, […]
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హాట్ కామెంట్లు చేశారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వలేరన్న ఆయన.. ఇంకా ఏం మిగిలిందని జగన్ 2.0 చూపిస్తాడు..? అని ప్రశ్నించారు..
రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.. కొందరు కోవర్టులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.. టీడీపీలోని చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. టీడీపీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి కొలుసు పార్థసారథి..