హైదరాబాద్ శివారులోని.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది.. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ [ఆర్సీఐ] ప్రాంగణంలో చిరుతలు సంచరించాయి.. దీంతో అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు.. రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది.
* నేడు వింబుల్డన్ ఉమెన్స్ ఫైనల్లో తలపడనున్న అనిసిమోవా, ఇగా స్విటెక్.. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ * విశాఖ: నేడు 16వ విడత రోజ్ గార్ మేళా.. విశాఖ నుంచి పాల్గొంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు * కాకినాడ: నేడు ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనున్న రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ * అనంతపురం : నేడు గుంతకల్లులో పర్యటించినున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనాభా భారం కాదు.. జనమే ఆస్తిగా పేర్కొన్న ఆయన.. ఎక్కవ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో అద్దె ఇస్తున్నారు, ప్రత్యక్ష నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపారు.. ఫ్రాన్స్ లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.. హంగేరిలో పెద్ద కుటుంబాలకు కారులు ఇస్తున్నారు.. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రభుత్వం 12 లక్షలు ఆర్ధిక సాయం చేస్తోంది.. 67.41…
జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దినోత్సవం ఫోకస్ తో జరుగుతోంది.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి..
హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అని వ్యాఖ్యానించారు.. మన దేశం వివిధ సంస్కృతులు ఉంటాయి.. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందన్నారు.. విదేశస్తులు మన భాష నేర్చుకుంటారు.. మనం హిందీ అంటే ఎందుకు భయపడాలి..? అని ప్రశ్నించారు. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదు.. జర్మనీ, ఇతర భాషలు నేర్చుకుంటున్నాం.. కానీ, హిందీతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు..
వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్టీ ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు విద్యార్థినులు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.