TDP vs YSRCP in Vinayaka Chavithi: వినాయక చవితి వేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.. అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం మొదలైంది.. పరవాడ మండలం, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం.. అయితే వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.. చవితి ఉత్సవాల్లో భాగంగా పంచాయితీకి సంబంధించిన వినాయక విగ్రహం పెట్టేందుకు స్థానిక రామాలయం దగ్గర ఇరువర్గాల మధ్య ఘర్షణ స్టార్ట్ అయ్యింది.. గత రెండు రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.. రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు గ్రామపంచాయతీలో ఉన్న రామాలయానికి తాళం వేశారు.. అయితే, తర్వాత రోజు టీడీపీ వాళ్లు కూడా రామాలయానికి తాళం వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
Read Also: Mahindra University: మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో నలుగురు అరెస్టు..
ఈ రోజు వినాయక చవితి కావడంతో ఇరు వర్గాల నాయకులు రామాలయం దగ్గరకు చేరుకున్నారు.. దీంతో, ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి.. విషయం తెలుసుకున్న పరవాడ పోలీసులు రంగప్రవేశం చేశారు.. పరవాడ సీఐ మల్లికార్జున రావు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు.. టిడిపి నాయకులను, వైసీపీ నాయకులను ఇరువర్గాలకు నచ్చజెప్పి.. మొదటగా వినాయకుని మండపానికి పర్మిషన్ తీసుకున్నవాళ్లే రామాలయంలో పూజ చేసుకోవచ్చని సీఐ తెలిపారు.. కానీ, వెన్నెలపాలెం వైసీపీ సర్పంచ్ కి మాత్రం మండపాలు పర్మిషన్ అవసరం లేదని వాదనకు దిగాడు సర్పంచ్.. అయితే, సర్పంచ్ అయినా సరే పర్మిషన్ తీసుకోవాలని పరవాడ సీఐ తేల్చి చెప్పారు.. చివరికి టీడీపీ వాళ్లు పర్మిషన్ ముందుగా తీసుకోవడంతో రామాలయంలో టీడీపీ నాయకులు వినాయకునికి మొదటగా పూజలు చేశారు..