తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ గాంధీభవన్‌లోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్ల కురుమలు. గంటకు పైగా గాంధీ భవన్లో నానా హంగామా జరిగింది. గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళకారులు. సమస్యలు చెప్పుకోవడం... వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకేగానీ.... ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్‌లోకి గొర్రెల్ని తీసుకు రావడం...
ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. అది ప్రజాస్వామ్య విజయం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.. ప్రజాస్వామ్యవాదులతో కలిసి 30 రోజులు పోరాటం చేసి ఎన్టీఆర్ విజయం సాధించారు.. ఇందిరా గాంధీ మెడలు వచ్చారని పేర్కొన్నారు..
ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య వివాదం కాస్తా.. ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.. స్వలింగ సంపర్కానికి ఒప్పుకోకపోవడంతో పాటు.. నీ వ్యవహారం బయటపెడతానని వార్నింగ్ ఇవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది.. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.. మర్రిపూడి కొండ వద్ద మండల విద్యాశాఖలో పనిచేస్తున్న కొల్ల రాజశేఖర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.. ఈ ఘటనలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు ఏలూరు పోలీసులు.. కోచ్ వినాయక ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు..
వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాటలు విని ప్రజల జోలికి వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు..
జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది అనే అనుమానం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరు దారుణంగా ఉంది. హింసని ప్రేరేపించే విధంగా ఉంది జగన్ తీరు ఉంది. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు తీసేవిధంగా ఉందని విమర్శించారు.. పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రెంటపాళ్లలో 100 మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
అనంతపురం నగర సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పోలీసులు పట్టుకున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం రాచనాపల్లి సమీపంలో కుమ్మర సురేష్ బాబు దారుణ హత్యకు గురయ్యాడు.. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సురేష్ బాబు భార్య అనితను, ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ పీజీసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఏపీ పీజీసెట్-2025 ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.. మొత్తం 31 బ్రాంచ్‌లలో 88.60 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు.. పీజీసెట్ -2025 కోసం 25,688 మంది నమోదు చేసుకోగా.. వారిలో 19,488 మంది అర్హత సాధించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.. వీరిలో 7463 బాలురు అంటే 87.70 శాతం.. మరియు 12025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత సాధించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..