Off The Record: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా 2024లో వైసీపీ ఓటమికి చాలా రీజన్సే ఉన్నాయి. 40 శాతం ఓట్లు ఉన్నా… ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు తెచ్చుకోలేక 11కే పరిమితం అయింది. పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చినా…వెంటనే తేరుకున్న అధ్యక్షుడు జగన్… తిరిగి ట్రాక్ ఎక్కించే పని మొదలుపెట్టారు. రకరకాల స్టేట్‌మెంట్స్, కార్యక్రమాలతో… ఫస్ట్ కేడర్‌లో ధైర్యం నింపగలిగారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ఎప్పుడు పిలుపునిచ్చినా… కింది స్థాయిలో ఊపు, ఉత్సాహం కనిపిస్తున్నా… నాయకుల్లో మాత్రం అది కొరవడిందన్న రిపోర్ట్ ఉందట అధిష్టానం దగ్గర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు సైతం ఇంకా ఫుల్ యాక్టివ్ కాలేదని జగన్ కూడా అసంతృప్తిగా ఉన్నారట. చివరికి మంత్రులుగా పని చేసిన వాళ్ళు కూడా సంబంధిత శాఖల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించడం లేదన్న అభిప్రాయం ఉందట. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్తే తప్ప తమకు తాముగా స్పందించటం మానేశారన్న అసహనం అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: కాళేశ్వరం ప్రాజెక్ట్ ముందు గోల ఒకటి..! వెనక మరో రకమైన రచ్చ జరుగుతోందా..?
పార్టీ వైపు నుంచి కూటమి సర్కార్‌కు ఏవైనా కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చినా.. దేనిమీద అయినా స్పందించాల్సి వచ్చినా… కొందరు నేతలు మాత్రమే గొంతు విప్పుతున్నారట. కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వాళ్ళు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఆర్కే రోజా, కాకాణి గోవర్దన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గుడివాడ అమర్నాధ్ వంటి నేతలు వీలు చూసుకుని అవసరమైన సమయాల్లో రియాక్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు విడదల రజనీ, జోగి రమేష్, లాంటి వాళ్లు హెడ్డాఫీస్ నుంచి ఆదేశాలు వెళ్తే తప్ప గొంతు సవరించుకోవడం లేదన్న అసంతృప్తి వైసీపీ పెద్దల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి కూడా హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టడంతో సరిపెడుతున్నారు తప్ప కేంద్ర కార్యాలయానికి అందుబాటులో ఉండటం లేదట.. ఇతర మాజీమంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, తానేటి వనిత, సుచరిత, పుష్ప శ్రీవాణి, అనిల్ కుమార్, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, ముత్యాలనాయుడు లాంటి వాళ్ళంతా.. తమకు అసలు పార్టీ వ్యవహారాలు పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట..
Read Also: AP Govt : ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు – రాష్ట్రవ్యాప్తంగా 12మంది జిల్లా కలెక్టర్లు మార్పు
కొందరు కేసుల కారణంగా సైలెంట్ అయితే… మరికొందరు మాత్రం ఎందుకొచ్చిన తలనొప్పులు సైలెంట్‌గా ఉంటే పోలా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే స్పందించే వారు కొందరైతే.. అవసరమైనప్పుడు చూద్దాంలే అనుకుంటున్న వారు మరికొందరు. ఇదే ఇప్పుడు జగన్‌కు తలనొప్పిగా మారందట. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారు అప్పుడు తాము చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేక పోవటం వల్లే ఫలితాలు ఘోరంగా వచ్చాయన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు సమాచారం. అది అప్పటి వరకైతే ఓకే…. కానీ, పార్టీ అధికారంలో లేని ఈ సందర్బంలో కూడా పట్టనట్లుగా వ్యవహరిస్తే ఎలా అన్న భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం.. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ కాలేజీల అంశంలో కూడా మాజీ మంత్రుల నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదని భావిస్తున్నారట జగన్. చేసిన అభివృద్దిని తాము చెప్పుకోలేక పోయామని, సరైన ప్రచారం చేసుకోలేక పోయామని జగన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన నోటి నుంచి మా యంత్రాంగం మొత్తం ఇంకా గేరు మార్చలేదన్న మాటలు వచ్చాయంటున్నారు. తమ హయాంలో ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయని, మెడికల్ కళాశాలలు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో అనేక కార్యక్రమాలను చేసినా చెప్పుకోవటంలో వెనుకబడి పోవటం వల్లే ప్రజలు మంచిని గుర్తించలేకపోయారని జగన్ అభిప్రాయ పడుతున్నారట. మరి వీటిని అధిగమించేందుకు ఆయన ఏం చేయబోతున్నారు.. పార్టీ యంత్రాంగాన్ని బూస్టప్ చేసేందుకు అనుసరించబోయే వ్యూహం ఏంటన్నది చూడాలి.