YS Jagan: గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంది. అన్నదాత పోరు, విద్యుత్ చార్జీలు, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర అంశాలపై ఆందోళనలు చేసింది. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయన్న టాక్ వచ్చింది. అయితే, ఆ కార్యక్రమాల్లో కేవలం వైసీపీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. ఎక్కడా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కనబడలేదు. అయితే, మిర్చి, పోగాకు, మామిడి రైతుల సమస్యలు తెలుసుకోడానికి పలు ప్రాంతాల్లో పర్యటించారు జగన్. అలాగే, పార్టీ నేతల్ని పరమార్శించడానికి కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు దాటడంతో… కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు జగన్.
Read Also: Hydra: మీ ఏరియాలో మ్యాన్‌హోల్ తెరిచి ఉందా..? ఈ నంబర్‌కి కాల్ చేయండి..
ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. అయితే… అందులో పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌కి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు జగన్. దీనిపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిరసన కార్యక్రమాల్లో కొత్త ఒరవడి తీసుకువచ్చారు జగన్. 24 గంటలు, 48 గంటలు, 96 గంటల దీక్షల చేపట్టారు. తాజాగా, సూపర్ సిక్స్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పేద విద్యార్ధులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలన్న తన డ్రీమ్ ప్రాజెక్టుకు తూట్లు పొడవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్. పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌లో పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. టెండర్ల ద్వారా వాటిని ఎవరైనా చేజిక్కించుకున్నా… తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామన్నారు. మరోవైపు… ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. ఈ పోరాటంలో తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని పోతామంటున్నారు.
Read Also: Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.40 లక్షలతో ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలంటే
మొత్తానికి త్వరలో ప్రజల పక్షాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గోబోతున్నారని స్పష్టమవుతుంది. తమ అధినేత వైఎస్ జగన్‌తో కలిసి రెట్టించిన ఉత్సాహంతో కదంతొక్కుతామంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అయితే, వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్… అమీతుమీకి సిద్ధమవుతున్నారా..? తన డ్రీమ్ ప్రాజెక్ట్ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌లో పెట్టడాన్ని తప్పుబడుతున్న జగన్.. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతున్నారు..? ఇంతకీ జగన్‌తో కలిసివచ్చేదెవరు..? ఆయన ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..