చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ అరాచకవాదులకు రాష్ట్రంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీని పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఏఐ హ్యాక్ థాన్ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అన్నారు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరయ్యారు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఇవాళ గుడివాడ కోర్టుకు హాజరయ్యారు కొడాలి నాని
హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలపై విద్యాశాఖ కమిషనర్‌ను వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది హైకోర్టు.
శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.. గత నాలుగు రోజులుగా స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండగా.. నల్లచెరువులోని క్రికెట్ స్టేడియంలో క్షుద్ర పూజలు చేశారు.. క్రికెట్ స్టేడియంలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేసినట్టు అనవాళ్లు కనిపిస్తున్నాయి.. క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండగా క్షుద్ర పూజలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు.
టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చినా.. ఉన్నా.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల తరచూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. రెగ్యులర్‌గా జరుగుతున్న పరామర్శ యాత్రల్లో భద్రతా వైఫల్యాలు బయటపడటం, వాటిని వైసీపీ శ్రేణులు హైలైట్ చేసి చూపడం కామన్ అవుతోంది. గుంటూరు, రాప్తాడు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనలన్నీ వివాదాస్పదం అవడంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.... మొత్తం ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు ధర్మాన ప్రసారావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారాయన. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల్లో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన... ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదాయన.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడో కొత్త రకం చర్చ మొదలైందట. పార్టీలో అందరిదీ ఒక లైన్ అయితే... జగ్గారెడ్డిది మరో లైన్ అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. గాంధీభవన్‌లో ఇటీవల పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో జగ్గారెడ్డి అన్న మాటల గురించే ఇప్పుడు చర్చ అంతా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం జరగాలంటే... కార్యకర్తలని సంతోషపెట్టడం ముఖ్యమని సూచించారట ఆయన.