Off The Record: లిక్కర్ కేసులో చెవిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయా..?
- దాదాపు 100 రోజుల నుంచి జైల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..
- జైల్ నుంచి కోర్ట్‌కు వచ్చి, వెళ్ళేటప్పుడు నానా హంగామా..
- కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్న మిగతా నిందితులు..
- నినాదాలిస్తూ, మీడియాతో మాట్లాడుతున్న చెవిరెడ్డి..
- వర్చువల్‌గా హాజరుపరచాలనుకున్న సిట్ అధికారులు..
- న్యాయమూర్తి నో చెప్పడంతో అందరితోపాటే కోర్ట్‌కు..
- అక్రమ కేసులు పెట్టారు, దేవుడి మీద ప్రమాణం చేస్తానంటూ వ్యాఖ్యలు..
- చెవిరెడ్డి వ్యూహం ప్రకారమే అలా మాట్లాడుతున్నారా?..
- తాను నిర్దోషినని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా?..
- జైల్‌లో ఉండి కూడా పోరాడుతున్నానని జగన్ దృష్టిలో పడాలనుకున్నారా?..
- మిగతా నిందితులకు ఇబ్బందిగా చెవిరెడ్డి వైఖరి?..
- మాట్లాడకుండా మేం తప్పును ఒప్పుకున్నట్టా అన్న అంతర్మథనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు గురించి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో డిఫరెంట్ చర్చ జరుగుతోంది. ఇందులో భాస్కర్ రెడ్డి ఏ 38గా, ఆయన కుమారుడు ఏ 39 గా ఉన్నారు. మద్యం ముడుపుల డబ్బుని ఎన్నికల సమయంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడంతోపాటు మరికొన్ని వ్యవహారాల్లో చెవిరెడ్డి కీలకపాత్ర పోషించినట్టు ఇప్పటికే చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిట్. అందులో భాగంగానే ఆయన అరెస్ట్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా జైలులో సుమారు 100 రోజులకు నుంచి కొనసాగుతున్న పరిస్థితి. అదంతా ఒక ఎత్తయితే… జైలు నుంచి కోర్ట్‌కు తీసుకువచ్చి, తిరిగి తీసుకువెళ్ళే ప్రతి సందర్భంలోనూ…మాజీ ఎమ్మెల్యే చేస్తున్న హంగామా గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కేసు విచారణ సందర్భంగా నిందితులు అందర్నీ రిమాండ్ ముగిసే సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలన్నది నిబంధన. అందుకోసమే.. అలాంటి ప్రతి సందర్భంలోనూ.. నిందితులు అందర్నీ విజయవాడ జైలు నుంచి ఏసీబీ కోర్టుకి తీసుకువస్తున్నారు అధికారులు. ఆ సమయంలో మిగతా నిందితులంతా… మీడియాతో మాట్లాడకుండా కోర్టు దగ్గరికి వచ్చిన తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్నారు.
Read Also: Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది..?
Also Read
అయితే చెవిరెడ్డి మాత్రం కోర్టుకు వచ్చే, తిరిగి వెళ్ళే సమయాల్లో మీడియాతో మాట్లాడ్డంతో పాటు రకరకాల నినాదాలివ్వడం, తనకు నచ్చిన వ్యాఖ్యలు రివాజుగా మారిందని అంటున్నారు. చివరికి ఇది సిట్ అధికారులకు కూడా తలనొప్పిగా మారిందట. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమ కేసులు పెట్టారంటూ… వచ్చిన ప్రతిసారి చెవిరెడ్డి కోర్టు దగ్గర నానా హంగామా చేస్తుండటంతో… ఆ దెబ్బకు సిట్ అధికారులు కూడా ఇక లాభం లేదనుకుని ఆయన్ని వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపరిచే ప్రయత్నం చేశారట. అయితే న్యాయమూర్తి అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చెవిరెడ్డిని కోర్టుకి తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డి పాత్ర ఉందని ఇప్పటికే సిట్ ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. మరోవైపు ఆయన కుమారుడు, ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకంగా ఉందంటూ పలు పిటిషన్లను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చింది సిట్. ఇదంతా ఒకవైపున జరుగుతుంటే ఆయన మాత్రం పదేపదే తనపై అక్రమ కేసులు పెట్టారని, కావాలంటే దేవుడి దగ్గర ప్రమాణం చేస్తానని, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదంటూ మాట్లాడ్డంపైనే అనుమానాలు వస్తున్నాయట.
Read Also: Bigg Boss 9 : నాగార్జుననే తప్పు బట్టిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఏంట్రా ఇది..
మామూలుగా అయితే.. ఆయన ఏదన్నా చెప్పదల్చుకుంటే ఒకటి రెండు సార్లు చెబితే సరిపోతుందిగానీ… ఇలా ఒకే మాటను ప్రతిసారి చెప్పడం వెనక కచ్చితంగా వ్యూహం ఉండి ఉంటుందని అంటున్నారు. ఒకే మాటని పదేపదే చెప్పడం ద్వారా తాను నిర్దోషినంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, అదే సమయంలో జైల్లో ఉండి కూడా పోరాటం చేస్తున్నానంటూ జగన్ దృష్టిలో పడే ప్లాన్ కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఇంకోరకమైన మాటలు కూడా వినిపిస్తున్నాయి. చెవిరెడ్డి తనకోసం తాను ఇలా చేసుకోవటం కరెక్ట్ అనిపించినా…. అది ఇతర నిందితులకు ఇబ్బందిగా మారిందట. కేసు విషయంలో తాము ఏమీ మాట్లాడకుండా కోర్టు లోపల వ్యవహారంపై దృష్టి పెడుతుంటే…భాస్కర్‌రెడ్డి ఇలా బహిరంగంగా మాట్లాడుతుంటే.. ఆయన ఒక్కరే తప్పు చేయలేదా? మాట్లాడకుండా ఉన్నందుకు మేం తప్పు చేశామని ఒప్పుకున్నట్టా అన్న డిస్కషన్ జరుగుతోందట మిగతా నిందితుల్లో. ఏం జరిగినా కోర్టు లోపల అయితే… బాగుంటుందని, అలా కాకుండా… ప్రతిసారి ఆయన ఇలా యాగీ చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏమీ లేకపోగా… ఏదన్నా తేడా కొడితే అందరం ఇబ్బందిపడతామని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదేం రచ్చ అన్న చర్చ అటు వైసీపీ వర్గాల్లో జరుగుతోందట. చెవిరెడ్డి నినాదాల్ని, ఆయన మాటల్ని తాడేపల్లి హెడ్డాఫీస్ వింటోందో లేదో మరి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!