CM Chandrababu: ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మంత్రుల సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించిన ఆయన.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది.. అందుకే కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.. ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ పథకాలను వివరించా.. కొన్ని జిల్లాల్లో GSDP పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోంది.. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలి అన్నారు.. అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులు కలిసి పనిచేయాలని సూచించిన ఆయన.. అమరావతిలో కట్టిన సీఆర్డీఏ భవనంలోని పై అంతస్తులో మానవ వనరుల అభివృద్ది సంస్థను ఏర్పాటు చేస్తాం. అధికారులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన కల్పించాలన్నారు.. కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో 7 గ్రూపులు ఏర్పాటు చేశాం.. ఇప్పటివరకు ఏం చేశాం, భవిష్యత్ లో ఏం చేయబోతున్నామనేది కలెక్టర్ల భేటీలో అందరూ సంక్షిప్తంగా చెప్పాలన్నారు.. సుదీర్ఘమైన ప్రెజెంటేషన్లు అవసరం లేదు.. సూటిగా.. సుత్తిలేకుండా చెప్పే ప్రయత్నం చేయాలని మంత్రులకు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Kurnool : గిట్టుబాటు ధర దక్కకపోవడంతో.. ఆగ్రహంతో టమోటాలు రోడ్డుపై పారబోసిన రైతులు