జులై ప్రారంభం నుంచి జనంలోకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఈ విషయంలో ఇప్పటికే వారికి అధినేత నుంచి ఆదేశాలు అందాయి. అయితే... టీడీపీ నేతలను ఓ డౌట్ బాగా వేధిస్తోందట. అధినేత ఆదేశించినట్టుగానే జనంలోకి వెళ్తాం సరే. వెళ్లి ఏం జనానికి ఏం చెప్పాలి..? సూపర్ సిక్స్‌లో పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఎలా కన్విన్స్ చేయాలి..? అని లోలోపల మధనపడిపోతున్నారట.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట రాజకీయం సలసలకాగుతోందట. ఇక్కడ.. ఎవరు సొంతోళ్ళో... ఎవరు ప్రత్యర్థులో కూడా అర్ధంకానంత గందరగోళం పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం పైకి మాత్రం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా నడుస్తోంది వ్యవహారం. ఎమ్మెల్యేది టీడీపీ, ఎమ్మెల్సీది వైసీపీ కావడంతో... ఆ రాజకీయ వైరం సహజమేననుకున్నారు.
పరిస్థితుల్ని బట్టి ఓడలు బళ్ళు....బళ్ళు ఓడలు కామన్. రాజకీయాల్లో అయితే.... దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పనేలేదు. సరిగ్గా ఇప్పుడు అదే స్ధితిని అనుభవిస్తున్నారట ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు. శాసనసభ్యులుగా గెలిచి ఏడాది పూర్తయిందన్న మాటేగానీ... సెల్ఫ్ శాటిశ్ఫాక్షన్ ఏ మాత్రం లేదట. 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన సీట్లన్నిటినీ కూటమి పార్టీలు ఏకపక్షంగా గెలుచుకున్నాయి.
బందరు పొలిటికల్ వార్ పీక్స్‌లో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మేటర్ రాజకీయాలు దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు కొల్లు రవీంద్ర. ఇక 2024లో కొల్లు మంత్రి అయ్యాక పరిస్థితులు తిరగబడ్డాయి.
అనగనగా ఒక రాజకీయ నాయకుడు. ఆయన పేరు ధర్మపురి శ్రీనివాస్. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారాయన. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేస్‌లో ఉన్నారు. అప్పట్లో అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్ళి సోనియాగాంధీని కలవగలిగిన స్థాయి ఆయనది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయి బీఆర్ఎస్లో చేరినా... ఫైనల్‌గా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు డీఎస్. ఆయన ఇద్దరు కొడుకుల్లో... సంజయ్ కాంగ్రెస్‌లో, అర్వింద్ బీజేపీలో ఉన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నెల్లూరు నాల్గో అదనపు కోర్టు.. అయితే, ఈ కేసులో కాకాణికి బెయిల్ వచ్చినా.. ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..
విశాఖపట్నంలో సంచలనం రేకెత్తించిన ఆరు హత్యల కేసులో ఎట్టకేలకు సెన్సషనల్ తీర్పు వెలువరించింది సెషన్స్ కోర్టు.. 2021 ఏప్రిల్ 15వ తేదీన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుని అప్పలరాజు అనే వ్యక్తి అతి దారుణంగా నరికి చంపాడు.. పాత పగలు, కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.. అయితే, నాలుగేళ్ల తర్వాత నిందితుడు అప్పలరాజుకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది విశాఖ సెషన్స్ కోర్టు.. నిందితుడు…
ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ నివేదిక ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు జరిపింది. బాధితులుగా ఉన్న ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటి వరకు 18 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగారని మళ్ళీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. బాబాయిని చంపి నా మీదే ఆరోపణలు చేశారు.. మొదట గుండెపోటు అన్నారు.. పోస్టుమార్టం తర్వాత మా నాన్న లేరు... చిన్నాన్న హత్యకు గురయ్యారన్నారు. మరుసటిరోజు నారాసుర రక్తచరిత్ర అన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అయితే, ఆ రోజే నిందితులను అరెస్టు చేసి ఉంటే ఇలాంటివి జరిగేనా..? అని ప్రశ్నించారు చంద్రబాబు..