ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు.. […]
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన […]
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్ ఫామ్ టికెట్లపై భారీగా వడ్డించింది.. కోవిడ్ నిబంధనల పేరుతో అదనంగా రూ. 20 పెంచేసింది రైల్వే శాఖ.. కోవిడ్ నియంత్రణ కోసం రద్దీని తగ్గించడానికి ప్లాట్ ఫాం చార్జీలను పెంచుతున్నామంటూ.. రూ.30 నుంచి రూ.50కి పెంచుతూ ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ ఓ ప్రకటన చేశారు.. కరోనా వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంలకు చేరకుండా నియంత్రించడం కోసమే ఈ నిర్ణయమని ప్రకటనలో పేర్కొన్నారు. […]
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే.. దేశంలోని ప్రజలంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేవారు.. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించగా… అక్కడున్న వాలంటీర్లు, అభిమానులు కేకలు […]
భారత్‌ను ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్ కలవర పెడుతోంది.. రికార్డుస్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, కొత్త కొత్త లక్షణాలు కూడా బయటపడుతున్నాయి.. అయితే, కరోనా ఎలా సోకుతుందన్న దానిపై తాజాగా పరిశోధకులు హెచ్చరించారు.. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన మనిషి.. ఎన్నో ప్రాంతాలను తాకుతాడు..! డబ్బులు సైతం చేతులు మారతాయి.. మళ్ళీ అది చేత్తో ఆహారం తీసుకోవడం లేదా చిరుతిండ్లు తినడం, శానిటైజర్ ఉపయోగించకుండా నోరు, ముక్కును ముట్టుకున్నా.. వైరస్ రావడం ఖాయం. మాస్క్ పెట్టుకోకుండా.. చేతులను […]
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వరంగల్‌లో పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది.. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపలను, ప్రారంభోత్సవాల కోసం వరంగల్ వెళ్లిన కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. మొదట కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను ప్రారంభించిన కేటీఆర్.. రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.. అనంతరం.. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తలు.. కాన్వాయ్ వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చారు.. వారిని నిలువరించేందుకు పోలీసులు […]
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.. సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన.. జానారెడ్డి పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్న ఆయన.. గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గిరిజనులకు 10 శాతం […]
పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దు అంటే చంద్రబాబుకు ఏం నొప్పి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మేలును చెప్పుకుంటూ.. గర్వంగా తాము ఓటు అడుగుతున్నామన్న ఆయన.. కానీ, టీడీపీ ఏమీ చెప్పుకొని ఓటు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.. […]