తెలంగాణలో ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.. ఇక, ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. 150 మార్క్ లకు ప్రశ్నలకు 2 గంటల సమయం కేటాయించారు.. సబ్జెక్టులో 60 మార్కులు (సైన్స్ 20 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, మాథ్స్ 20 మార్క్స్).. సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు 10 వ తరగతి.. అంత లోపు తరగతుల […]
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. అదేదారిలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్సీ బోర్డు ఎగ్జామ్స్ ను రద్దు చేసింది.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా సెకండ్ […]
కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక, ఈనెల 21న రాజన్న […]
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. బుధవారం రోజు బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయన.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు […]
మాయదారి మహమ్మారి కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఒకే ఒక మర్గం వ్యాక్సినేషన్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఆగిపోయే పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న మొత్తం వ్యాక్సినేషన్‌ను పంపిణీ చేశారు వైద్య సిబ్బంది.. దీంతో.. కేంద్రం వ్యాక్సిన్ డోసులు పంపేవరకు వేచిచూడాల్సిన పరిస్థతి. ఇటీవలే కేంద్రం నుంచి వచ్చిన 6 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు సిబ్బంది.. దీంతో.. ఏపీలో జీరోకు పడిపోయాయి వ్యాక్సిన్ నిల్వలు.. మరోవైపు.. మరిన్ని డోసులు కావాలంటూ […]
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు.. […]
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన […]
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్ ఫామ్ టికెట్లపై భారీగా వడ్డించింది.. కోవిడ్ నిబంధనల పేరుతో అదనంగా రూ. 20 పెంచేసింది రైల్వే శాఖ.. కోవిడ్ నియంత్రణ కోసం రద్దీని తగ్గించడానికి ప్లాట్ ఫాం చార్జీలను పెంచుతున్నామంటూ.. రూ.30 నుంచి రూ.50కి పెంచుతూ ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ ఓ ప్రకటన చేశారు.. కరోనా వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంలకు చేరకుండా నియంత్రించడం కోసమే ఈ నిర్ణయమని ప్రకటనలో పేర్కొన్నారు. […]