సింహాచలం భూముల్లో జరిగిన అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సింహాచలం దేవస్థానానికి గతంలో ఈవోగా పని చేసిన రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవదాయ శాఖ కమిషనర్.. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్‌పై అభియోగాలున్నాయి… ప్రస్తుతం దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్-2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్రమోహన్.. సర్కార్‌కు సరెండర్ చేశారు.. అయితే, ఈ వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరిగేందుకే రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు చెబుతున్నారు. కాగా, సుమారు 700 ఎకరాలను సింహాచలం దేవస్థానం రికార్డుల నుంచి తప్పించినట్టు గుర్తించింది దేవదాయ శాఖ.. వివాదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహరంలోనూ రామ చంద్రమోహన్ అక్రమాలకు పాల్పడినట్టు దేవదాయశాఖ గుర్తించినట్టుగా తెలుస్తోంది.