తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం హీట్ పెంచుతోంది.. తెలంగాణ మంత్రుల కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జలవివాదంపై చర్చ జరిగింది… చుక్కునీరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని కేబినెట్ ప్రకటించింది. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ వ్యవహర శైలి కొంత కాలంగా చూస్తున్నాం.. ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో 844 అడుగులపైకి ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యం అవుతుందన్న ఆయన.. తెలంగాణ 800 అడుగులకే నీటిని డ్రా చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇక, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. మేం మాట్లాడలేక కాదని… అంతకు ఎక్కువగా మాట్లాడే మంత్రులు ఇక్కడ ఉన్నారన్నారు మంత్రి అనిల్.
ఏపీకి కేటాయించిన నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నా తెలంగాణ అభ్యంతరం చెబుతోందని విమర్శించి అనిల్ కుమార్ యాదవ్… శ్రీశైలం ప్రాజెక్టు నిండకూడదనే రీతిలో తెలంగాణ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.. జీవో జారీచేసి మరీ జల విద్యుత్ ఉత్పత్తి పూర్తి సామర్ధ్యంతో పని చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం సరికాదన్న ఆయన.. ఏపీ ప్రభుత్వానికి చేత కాక కాదు.. గట్టిగానే రియాక్ట్ అవుతామన్నారు.. తెలంగాణ దుర్మార్గంపై ఎంత వరకైనా వెళ్తామన్న మంత్రి అనిల్.. ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారని.. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు.. ఈ వ్యవహారంపై కేఆర్ఎంబీ లేఖ రాస్తాం.. ప్రధాని మోడీకి కూడా లేఖ రాస్తామని.. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో విడుదల చేసిన నీటి మొత్తాన్ని వారి కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరతామన్నారు.. ప్రాజెక్టుల సందర్శన కోసం నోడల్ అధికారిని కేటాయించమని కేఆర్ఎంబీకి చెప్పలేదు.. గతంలో కరోనా కారణంగా పర్యటన సాధ్యం కాదని చెప్పామని తెలిపారు మంత్రి అనిల్ కుమార్.. రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే ముందు కేఆర్ఎంబీ బృందం తెలంగాణ అక్రమంగా నిర్మించే ప్రాజెక్టులను సందర్శించాలని కోరతామన్న ఆయన.. మాటలతో పరిష్కారం లభిస్తుందంటే మేం అంతకంటే ఎక్కువగా మాట్లాడగలం అన్నారు..