కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నడూ లేని పద్ధతిలో అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎంకు ప్రేమ పుట్టుకు వస్తుందని సెటైర్లు వేశారు.. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని కోరాను.. విద్య విషయంలో కొంత పురోగతి ఉన్న వైద్యం విషయంలో లేదన్నారు.. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. నాలాంటి వారికి పేరు వస్తుందని పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు ఈటల.. నేను ఆ శాఖ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు వైద్య శాఖపై ప్రేమ ఒలకబోస్తున్నారని.. నేను బయటకు వచ్చిన తరువాత వైద్యశాఖ తన ఆధీనంలో ఉంచుకుని ఇప్పుడు బయటకు వచ్చారని సెటైర్లు వేశారు. ఇక, దళితుడికే మొదటి ముఖ్యమంత్రి పదవి అని ప్రకటించిన కేసీఆర్.. మాట తప్పేది లేదన్నారు. మాట తప్పితే తల నారుక్కుంట అన్నారు.. దళితులకు ముఖ్యమంత్రి అన్న మాట పక్కకు పెడితే ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారని మండిపడ్డారు.. దళితులు పాలించేందుకు అర్హులు కాదని అవమానించారన్న ఆయన.. సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారులకు అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దళితుడు అయిన భూపాలపల్లి కలెక్టర్‌గా పని చేసిన మురళిని అవమానించి పంపించారు. అనేక మంది దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానించారు. వారికి రావలసిన అధికారాలు రాకుండా చేశారని దుయ్యబట్టారు.
ఈ ఏడు సంవ్సరాల్లో కనీసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు ఈటల రాజేందర్.. దళితులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిచాల్సింది పోయి సీఎం కు వంత పాడుతున్నారంటూ ప్రతిపక్షాలపై ఫైర్ అయిన ఆయన.. దళితులకు ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ఎంత మందికి సాయం చేశారు అని ప్రశ్నించారు.. ఏమి చేయకుండా ఇప్పుడు ఏమో చేస్తామని దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానాలను వ్యక్తం చేసిన మాజీ మంత్రి… ఎన్ని లక్షల మందికి ఎన్ని ఎకరాలు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం దళితులకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వాళ్ల బతుకులు బాగుపడేవి అని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంత మంది పేదలకు ఇచ్చారు అంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చెప్పింది తప్ప మరొకరికి గౌరవం లేదు.. ఆయన చెప్పిందే వేదం.. కేసీఆర్ చెప్పిన మాట తప్ప మరొకరి మాట గౌరవించే పరిస్థితి లేదని ఆరోపించారు ఈటల.. మీకు పదవులు ఇచ్చిన, బతుకు ఇచ్చిన జాతికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోక పోవడం హేయమైన చర్య అని కామెంట్ చేసిన ఆయన.. నేను కూడా ఇంత కాలం మాట్లాడక పోవచ్చు.. కానీ, ఇప్పుడు కూడా మాట్లాడక పోతే నాకు పుట్టగతులు ఉండవని గళం విప్పుతున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వంలో జరిగే అనేక సార్లు ప్రజా వ్యతిరేక విధానాల పై ముఖ్యమంత్రిని ప్రశ్నించా.. ప్రశ్నించినందుకే నాపై కేసీఆర్ కుట్ర చేశారని.. మీరు చేసే పనులకు పరువు పోతుందన్నారు. ప్రజలకు విజ్ఞప్తి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత మీ మీద ఉందన్న ఈటల.. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా హుజురాబాద్‌లో బీజేపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక, నేను కోవిడ్ సమయంలో ప్రజల కోసం తిరిగితే.. సీఎం ఫామ్ హౌస్ లో కూర్చొని నా భూముల లెక్కలు తీసి నా మీద కుట్ర చేసే ప్రయత్నం చేశారని విమర్శించిన ఈటల.. కేసీఆర్ కుట్రలకు కేరాఫ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..