కరోనా పెను సవాల్‌గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవసరం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయకత్వానికి ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో కరోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివరించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న […]
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు.. భారత్‌లో చాలా ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగు చూస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి.. దీంతో. అప్రమత్తమైన కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించిన వెంటనే […]
తెలంగాణలో రేపు ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు విద్యాశాఖ అధికారులు… టెన్త్ ఫలితాల రేపు ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు.. దీంతో.. పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులను అందరినీ పాస్ చేసింది. అయితే, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇచ్చి గ్రేడింగ్ కేటాయించనున్నారు.. దీనికి సంబంధిన ఏర్పాట్లను […]
డీఏపీ ధరలు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్రభుత్వం ఇవాళ రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్.. అదే సమయంలో.. పెరిగిన భారాన్ని రైతులపై మోపకుండా సబ్సిడీ రూపంలో తామే భరిస్తామని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర సర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1,700 ఉండగా.. రూ. […]
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండడంతో.. మహమ్మారి కట్టడికి అన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అందులో కేసులు భారీగా వెలుగు చూస్తున్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు పూనుకున్నాయి.. కరోనా కంట్రోల్ కాకపోవడంతో.. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నాయి.. ఇక, లాక్డౌన్ ను మే 31వ తేదీ వరకు తాజాగా నిర్ణయం తీసుకుంది నాగాలాండ్ ప్రభుత్వం.. కరోనా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల ఏమాత్రం లేకపోవడంతో లాక్డౌన్ పొడిగింపునకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, లాక్డౌన్ నుంచి […]
కరోనా పేరు చెబితేనే అంతా ఉలిక్కిపడుతున్నారు.. కరోనా సోకిందంటే నా అనేవాళ్లు కూడా మళ్లిచూసే పరిస్థితి లేకుండా పోయింది.. ఈ మహమ్మారిని తిట్టుకోని దేశం ఈ ప్రపంచంలో లేకుండొచ్చు.. అయితే, దీనిని క్యాష్ చేసుకునేవాళ్లు సైతం లేకపోలేదు.. ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ ఆస్పత్రులు అందినకాడికి పిండుకునే పనిలోపడిపోయాయి. మరోవైపు.. అంతా దెయ్యంగా చూస్తున్న కరోనా వైరస్‌ను దేవతగా భావించేవారు కూడా లేకపోలేదు.. తమిళనాడులో ఏకంగా 48 అడుగుల కరోనా వైరస్ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించారు.. కోయంబత్తూరులోని కామత్చిపురిలోని […]
కరోనా నివారణ చర్యల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది.. ప్రభుత్వాలకు ఇది భారంగా కూడా మారుతోంది.. అయితే, కరోనా కట్టడి చర్యలకు సాయం అందించడానికి మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నాయి పలు సంస్థలు.. తాజాగా, కియా మోటార్స్ తన వంతు సాయం ప్రకటించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్టీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన పత్రాలను అందజేశారు కియా ప్రతినిధులు. ఈ నిధులను […]
కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథలైతే ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనుండగా.. అల్పాదాయ […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో… దానిబారినపడి కోలుకున్న వారిపై ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి… తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి.. అయితే, ఈ సమయంలో.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించింది రాజస్థాన్ సర్కార్.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడగా.. వీరి చికిత్స కోసం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. […]