కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం.. ఉత్తర్వులు రావడం అన్ని జరిగిపోయాయి.. తాజాగా పెట్రోల్ బంక్‌లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా పనిచేయనున్నాయి. కాగా, లాక్డౌన్ సమయంలో పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి… రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాలని తన లేఖలో పేర్కొన్నారు.. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు […]
సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. అనంతరం రఘురామకు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు.. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందనీ.. పరీక్షలు మొత్తాన్ని వీడియో తీశామని పేర్కొన్నారు.. ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు మెడికల్ కేర్‌లో ఉన్నారని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి… […]
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజకు మరోసారి కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించారు.. కోవిడ్ కట్టడికి ఆమె చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.. దీంతో.. మళ్లీ ఆమె ఆరోగ్యశాఖ మంత్రి అనే ప్రచారం జరిగింది. కానీ, సీపీఎం తీసుకున్న ఓ నిర్ణయంతో.. ఆమెతో పాటు పాత మంత్రులకు ఎవరికీ అవకాశం దక్కలేదు.. సీఎం పినరాయి విజయన్ మినహా పాత వారు ఎవరూ కేబినెట్లో లేకుండా పోయారు.. అయితే, శైలజా టీచర్‌గా పేరుపొందిన ఆమెకు […]
అసెంబ్లీ ఎన్నికలకు ముందు… ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హాట్ టాపిక్‌గానే మారిపోతున్నాయి.. గవర్నర్‌ను మార్చాలంటూ తాజాగా టీఎంసీ అధినేత్రి, బెంగాల సీఎం మమతా బెనర్జీ… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయడం సంచలనంగా మారింది..నారద స్కామ్‌లో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్‌తో పాటు నలుగురు తృణమూల్ నేతలను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లేఖలు రాశారు దీదీ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం […]
కరోనాను చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తుండగా… వ్యాక్సినేషన్‌పై కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని స్పష్టం చేశారు.. ఆ సంస్థ చీఫ్ అదర్ పూనవల్లా. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని […]
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు.. అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది […]
భారత్‌లో కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.. దీని వెనుక సీఎం పినరయి విజయన్‌తో పాటు.. ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కృషి ఎంతో ఉంది.. దానికి తగ్గట్టుగానే ఆమెకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి, ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.. అరుదైన గౌరవాన్ని కల్పించాయి. అయితే, తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు శైలజా టీచర్.. మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి […]
భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ అల్ల కల్లోలం చేస్తోంది.. దాని దెబ్బకు చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి.. మరికొన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అయితే, థర్డ్ వేవ్ ముప్పు కూడా లేకపోలేదని.. అది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన… […]