రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు.. […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.. మొదట కృష్ణపట్నంతో ప్రారంభమైన కరోనా ఆయుర్వేద మందు పంపిణీ.. క్రమంగా నెల్లూరు జిల్లా.. పక్క జిల్లాలు.. పక్కా రాష్ట్రాలు.. ఇలా క్రమంగా కరోనా బాధితులు కృష్ణపట్నం బాటపట్టారు.. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో.. మందు పంపిణీ కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి విచ్చింది.. అయితే, ఈ వ్యవహారంపై ఆరా తీశారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్ తో మాట్లాడారు వెంకయ్య.. […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇక, తాను తయారు చేస్తున్న మందులపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులతో మందు తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పనితీరు.. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు.. దాటేసింది.. దీంతో.. కోవిడ్ మందు కోసం తరలివచ్చినవారితో కృష్ణపట్నం జనసంద్రంగా మారిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా పంపిణీని నిలిపివేశారు. ఇక, ఆయుర్వేద మందు పంపిణీపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.. వేల […]
టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది… భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్.. ఇవాళ కన్నుమూశారు.. 63 సంవత్సరాల కిరణ్ పాల్ సింగ్.. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు.. నోయిడాలో కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కానీ, ఈరోజు మీరట్‌లోని తన నివాసంలో కన్నుమూశారు కిరణ్ పాల్.. ఇక, కాలేయ సంబంధ సమస్యలు కూడా ఆయనను వేధించినట్టు చెబుతున్నారు.. యూపీ పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేసిన ఆయన.. వీఆర్ఎస్ తీసుకున్నారు.. కానీ, గత సంవత్సరం సెప్టెంబర్‌లో కేన్సర్ […]
కరోనా సమయంలో రెమ్‌డెసివర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది… ఈ ఇంజక్షన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి.. మార్కెట్లో దొరకని పరిస్థితి… దీంతో.. కేటుగాళ్లు దీనిని సొమ్ము చేసుకోవడానికి బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు.. బాధితుల అవసరాన్ని బట్టి అందినకాడికి దండుకునేపిలో పడ్డారు.. ఇప్పటికే చాలా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు.. అయితే.. ఈ రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో.. ఈ […]
రోనా నిర్ధారణ పరీక్షలు మరింత సులువుగా.. ఇంటి దగ్గరమే స్వయంగా చేసుకునే వెసులుబాటు వచ్చేస్తోంది… కరోనా టెస్ట్ చేయించుకోవాలంటూ.. స్థానికంగాఉన్న పీహెచ్‌సీకో.. ప్రభుత్వ ఆస్పత్రిలో వెళ్లి గంటల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేదు.. ఇక, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. ర్యాపిడ్ టెస్ట్.. ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐసీఎంఆర్.. ఈ కిట్లు మరో రెండు మూడు రోజుల్లోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు.. […]