కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు.. కొత్తగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాన్సుఖ్ మాండవియాను కలిసిన ఆయన శుభాకాంక్షలు తెలియజేవారు.. ఈ సందర్భంగా బీబీ నగర్ అఖిల భారత విజ్ఞాన సంస్థలో మూడవ బ్యాచ్‌లో ప్రవేశం చేసే విద్యార్ధులకు అవసరమగు ఇంఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర వనరులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని.. తర్వాత ఆ మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీని కూడా కలిసినట్టు కోమటిరెట్టి ప్రకటించారు.. మొదట అడిగిన ప్రపోజల్‌కు 20 శాతం ఎక్కువ బిల్డింగ్ అవసరమని అభ్యర్ధించిన ఆయన.. దానికి వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా సెక్రెటరీ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేశారు.. ఒక వారము రోజులలో భవన సముదాయ నిర్మాణమునకు టెండర్లు పిలువమని కూడా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.