పాల ధరలను మరోసారి పెంచేసింది మదర్ డెయిరీ.. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ ఇవాళ నిర్ణయంతీసుకోగా… పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.. అన్ని రకాల పాలకు పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొంది మదర్ డెయిరీ.. ధర పెంపుకు కారణం ఖర్చులు పెరగమే అంటోంది మదర్ డెయిరీ.. 2019లో పాల ధరలు పెంచగా.. కరోనా మహమ్మారి సమయంలో.. పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకింగ్, రవాణ ఖర్చులు పెరిగిపోయాయని.. అందుకే ధరలు పెంచక తప్పని పరిస్థితి వచ్చింది పేర్కొంది. రైతుల నుంచి పాల సేకరణ ధర పెరిగినా.. గత ఏడాది కాలంగా వినియోగదారులపై భారం మోపలేదని.. కానీ, ఇప్పుడు పెంచక తప్పనిసరి పరిస్థితి వచ్చిందంటున్నారు.. పెంచిన పాల ధరలు ఉత్తరప్రదేశ్, ముంబై, నాగపూర్, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ఆదివారం నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మదర్ డెయిరీ రోజుకు 30 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తూ వస్తోంది.. ఇక, జులై 1వ తేదీ నుంచి అముల్ తన పాల ధరలను రూ.2 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.