ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య.. 106కు పెరిగింది.. ఇదే సమయంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా […]
తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే నమోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసి తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 71,070 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 25 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. […]
కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామన్న సీఎం కేసీఆర్.. రాత్రికిరాత్రే.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడానికి కారణాలేంటి..? అని ప్రశ్నించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం.. మంచిదే.. కానీ, ఆలస్యం ఎందుకైంది..? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్దిపొందుతారు. అదే ఆరోగ్యశ్రీ అయితే 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉందని వారే చెప్పారని గుర్తుచేసిన ఆయన.. మరి ఇప్పుడు […]
సరిగ్గా తాళి కట్టాల్సిన సమయంలో పెళ్లిపీఠల పై నుంచి పరారయ్యాడు ఓ యువకుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పలేక.. తాళి కట్టే వరకు తెచ్చుకున్న అతగాడు.. చివరి సమయంలో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ నిబంధనల మధ్య గ్రాండ్‌కు పెళ్లి ఏర్పాట్లు చేశారు పెద్దలు.. అంతా హడావుడి.. వధూవరుల తరఫు బంధువులు వచ్చేశారు.. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు […]
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్… అయితే లాక్డౌన్ సడలింపుల సమయంలోనే కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కేవారి సంఖ్య భారీగానే ఉంది… అసలు తమకు ఏదీ పట్టనట్టుగా చిన్నచిన్న కారణాలు చెప్పి యథేచ్ఛగా తిరిగేస్తున్నారు కొందరు. దీంతో.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు తెలంగాణ పోలీసులు.. ఈ మేరకు పోలీసు అధికారులకు డీజీపీ […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. వరుసగా చాలా పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. ఇక, కొన్ని పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం.. తాజాగా.. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించాల్సిన పరీక్షను కూడా వాయిదా వేసింది ప్రభుత్వం… షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల (జూన్) 6వ తేదీన 6వ తరగతి అడ్మిషన్స్ కోసం, 5వ తేదీన 7 నుండి 10 వ తరగతిలలో ఖాళీ సీట్ల అడ్మిషన్స్ కోసం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.. కానీ, […]
కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించిన సీఎం.. అంగన్వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను పరిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలను కలిపే విధంగా […]
సింగపూర్ స్ట్రెయిన్‌తో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రభావం ఉందని.. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వెంటనే ఆ దేశం నుంచి విమానాల రాకపోలకు నిలిపివేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్‌గా మారిపోయాయి.. సింగపూర్ వేరియంట్ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది కేంద్రం.. ఆయన వ్యాఖ్యలపై సింగపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. స్పందించిన భారత ప్రభుత్వం.. అరవింద్ కేజ్రీవాల్.. […]
ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం అంటూ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, నర్సులకు భరోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ, […]