ఐపీఎస్ ఆఫీసర్‌పై దేశద్రోహం కేసు.. కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ ఆఫీసర్ జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు.. అక్రమాస్తుల కేసులో జీపీ సింగ్‌ను గత వారమే సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.. అయితే, ఆయన ఇంట్లో సోదాల సందర్భంగా.. ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు కొన్ని కీలకమైన కాగితాలు దొరికాయి.. రెండు వర్గాల మధ్య విబేధాలు సృష్టించేలా.. శతృత్వాన్ని పెంచేలా.. ఘర్షణలకు దారితీసేనలా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై కుట్ర పనినట్టు ఆరోపిస్తున్న పోలీసులు.. జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు.. రాయ్‌పూర్‌లోని కొత్వాలి పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 124-ఏ, 153-ఏ ప్రకారం జీపి సింగ్ పై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు..
ఇక, అక్రమాస్తుల కేసులో ఇటీవలే మూడు రోజుల పాటు ఏసీబీ, ఈఓడబ్ల్యూలు సుమారు 15 చోట్ల సోదాలు నిర్వహించారు.. జీపీ సింగ్ దగ్గర సుమారు పది కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ జీపీ సింగ్.. గతంలో ఏసీబీలో అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా చేశారు. జీపీ సింగ్ సింగ్ ఇంట్లో కొన్ని చింపేసిన కాగితాలు దొరికాయని, వాటిని పరిశీలిస్తే.. ఏదో కుట్ర పన్నినట్లు అర్థమైందని పోలీసులు చెబుతున్నారు.. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాల ఆధారంగా తనపై చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ తెలిపారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను కూడా సూచించిందన్నారు.. అయితే, తనపై దేశద్రోహ కేసులో సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనపై సిబిఐ వంటి స్వతంత్ర ఏజెన్సీ చేత దర్యాప్తు చేయించాలని కోరాడు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..