కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. క్లాసులు ఆన్‌లైన్‌లోనే.. ఇక పరీక్షల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే.. పోటీ పరీక్షలు మినహా.. బోర్డు ఎగ్జామ్‌లతో పాటు అన్నీ రద్దు చేశారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. స్కూళ్లను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మొదటి విడత నాడు-నేడు పనులు అదే రోజు ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లు కూడా అదే రోజు విద్యాశాఖ అందజేసే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.