కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్‌లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.