హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది… బండ్లగూడ మల్లికార్జుననగర్‌లో అర్ధరాత్రి వినోద్ అనే వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు.. ఓ ఇంటిపై దాడి చేసిన వినోద్.. వృద్ధురాలితో పాటు మనుమడు జాన్ మెడిపై కత్తితో దాడి చేశాడు.. ఇద్దరూ పెద్దగా కేకలు వేయడంతో ఆ ఇంటికి స్థానికులు చేరుకున్నారు.. దీంతో.. దాడి చేసిన వినోద్ పారిపోయే ప్రయత్నం చేయగా… అతడిని వెంటాడి పట్టుకున్నారు కాలనీ వాసులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. […]
రాయలసీమ ఎత్తిపోతల పేరిట పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ తీవ్ర విమర్శలకు గురవుతున్నది. దీనిపై కృష్ణాజలాల సంఘానికి లేఖ రాయగా.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలిచ్చారు. అయితే, గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్‌లతో కేంద్ర నీటిపారుదల మంత్రి గజేంద్ర షెకావత్ జరిపిన తొలిసమావేశంలోనే ఇరు రాష్ట్రాల అనధికార ప్రాజెక్టులను నిలిపేయాలని పూర్తి వివరాలుండే డిపిఆర్లు సమర్పించి ఆమోదం పొందిన తర్వాతనే ముందుకు సాగాలని నిర్ణయించారు. అయితే […]
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్‌లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నియమాకంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. రేపో, మాపో అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఊరిస్తూనే ఉంది.. తాజా పరిణామాలు చూస్తుంటే.. లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్‌ను నియమించింది అధిష్టానం.. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి […]
నారద కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మమతా బెనర్జీ నుంచి రికార్డ్ అఫిడవిట్ తీసుకునేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వం, న్యాయశాఖ మంత్రి హైకోర్టులో తాజా అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. దీనికి ముందు, నారద స్కామ్‌లో తమ స్టేట్మెంట్ను […]
అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మియామీ నగరంలో 12 అంతస్తుల భవనం కుప్పకూలింది. మొత్తం 136 ఫ్లాట్లలో 55 ఫ్లాట్లు కూలినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా… 159 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అర్ధరాత్రి ఒకటిన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది… సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల […]
గుంటూరు గ్యాంగ్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు కృష్ణ తల్లి మల్లీశ్వరి పరారైంది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి.. ఇద్దరు పిల్లలతోపాటు వెళ్లిపోయినట్టు సమాచారం. కృష్ణ ఆదేశాలతోనే తల్లి మల్లీశ్వరి పరారైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని రెండు బైకులపై నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. మరో నిందితుడు వెంకటరెడ్డి తల్లి, చెల్లి, భార్యను… ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అయితే ఆరు రోజులు గడుస్తున్నా… కృష్ణ, […]
రాష్ట్రంలో.. దేశంలో.. అంతెందుకు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన చోటు చేసుకున్నా.. అది శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు ముందే చెప్పారని చెబుతుంటారు.. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయంలోనూ బ్రహ్మంగారు ముందే చెప్పారని ఆధారాలు చూపుతున్నారు.. కానీ, మరోవైపు బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి వ్యవహారం పెద్ద రచ్చగా మారడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది.. పలు దపాలుగా చర్చల తర్వాత ఇవాళ కొలిక్కి వచ్చింది మఠాధిపతి వ్యవహారం… దీంతో.. బ్రహ్మంగారిమఠం మఠాధిపతి ఎంపిక పూర్తి అయినట్టే […]
పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం గడువును ఇప్పటికే పలు దపాలుగా పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఆ గడువును పొడిగిస్తూ ప్రకటన చేసింది.. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ నెల 30వ తేదీతో గడువు మిగిసిపోనుండగా… ఆ తేదీని సెప్టెంబర్ 30వ వరకు పొడిగించారు.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మరోవైపు వివాద్ సే విశ్వాస్ పథకం గడువును ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది కేంద్రం… […]
వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.. కానీ, ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు కాకరేపుతున్నాయి.. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో స్నేహం నెరుపుతాయని కాంగ్రెస్, ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన ఆయన.. పేదలకు డబ్బు ఆశ చూపి మదర్సాలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు.. ముస్లిం దేశాల నుంచి నేరుగా మతం మారిన పేదల ఖాతాల్లో నగదు జమ […]