సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్.. డ్రగ్స్‌కు సంబంధించిన ఎక్సైజ్ శాఖ కేసులో నిందితులైన కెల్విన్ పీటర్ కమింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై సినీ ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి.. 10 రోజుల క్రితం పూరి జగన్నాథ్ తో పాటు 11 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది ఈడీ.. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది.. నిందితుల దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్న తర్వాత డబ్బుల చెల్లింపులపైఈడీ ఆరా తీయనుంది.. ఇక, తొలిరోజు విచారణకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హాజరయ్యాడు.. పూరీ వెంట ఆయన కుమారుడు ఆకాష్, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.. 2017లో ఎక్సైజ్ శాఖ బుక్ చేసిన కేసులో పూరీని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో విదేశీ పెడలర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ కొనసాగుతోంది.. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గా ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఏ రూపంలో కొనుగోలు చేశారు అన్న కోణంలో విచారణ సాగనుంది..
ఇక, ఈ కేసులో సెప్టెంబర్ 2న నటి చార్మీ, సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 8న మరో స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న మరో హీరో రవితేజా, అతని డ్రైవర్ శ్రీనివాస్‌ను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్ 13వ తేదీన నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్ 15వ తేదీనా ముమైఖాన్, సెప్టెంబర్ 17వ తేదీన నటుడు తనీష్, సెప్టెంబర్ 20న హీరో నందు, సెప్టెంబర్ 22న హీరో తరుణ్‌ను ఈడీ విచారించనుంది. ఈ కేసుతో లింకులు ఉన్న మరికొందరిని విచారించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు.. దీంతో.. ఈడీ విచారణ ఇప్పుడు కీలకంగా మారింది.