బెంగళూరులో అతివేగం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది.. వేగంగా దూసుకెళ్లిన ఆడి కారు.. కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది.. దీంతో.. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు.. హోసూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వై. ప్రకాష్ కుమారుడు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇక, మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.. తెల్లవారుజామన 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.